News June 26, 2024
శ్రీకాకుళం: ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ ఫలితాల్లో 12వ స్థానం

కాసేపటి క్రితం ఇంటర్ ఫస్టియర్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. శ్రీకాకుళం జిల్లా నుంచి 7,113మంది విద్యార్థులు పరీక్ష రాయగా 3,047 మంది పాసయ్యారు. జిల్లాలో 43శాతం ఉత్తీర్ణత నమోదైంది. రాష్ట్రంలోనే శ్రీకాకుళం 12వ స్థానంలో నిలిచింది. అలాగే ఒకేషనల్ గ్రూప్‌లో 341 విద్యార్థులు రాయగా 187మంది పాసయ్యారు. దీనిలో 55శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది.
Similar News
News December 21, 2025
శ్రీకాకుళం జిల్లా TDP అధ్యక్షుడిగా రమేశ్.!

శ్రీకాకుళం జిల్లా TDP అధ్యక్షుడిగా మొదలవలస రమేష్‌ను పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని ఎప్పటి నుంచో సీఎం చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు రమేశ్ జెండా పట్టి జిల్లా TDPకి పునర్వైభవానికి తీసుకొచ్చారని పార్టీ శ్రేణులు చెప్పుకొచ్చారు.
News December 21, 2025
శ్రీకాకుళం: మీ పిల్లలకు ఈ చుక్కలు వేయించారా?

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం ఉదయమే పల్స్ పోలియో కార్యక్రమం మొదలైంది. ఆరోగ్య కార్యకర్తలు తమకు కేటాయించిన శిబిరాలకు చేరుకున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తీసుకు వచ్చి పోలియో చుక్కలు వేయిస్తున్నారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ప్రభుత్వ ఆసుపత్రి, బస్టాండ్, మెయిన్ సర్కిళ్ల వద్ద చుక్కలు వేస్తున్నారు. పోలాకి మండలంలో MLA బగ్గు రమణమూర్తి ప్రారంభించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని పైఫొటోలో చూడవచ్చు.
News December 21, 2025
సోంపేట: చెరువులను కాపాడాలని కలెక్టర్‌కు ఫిర్యాదు

సోంపేట పట్టణంలోని చెరువులు, ప్రభుత్వ భూములు ఆక్రమణలపై కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు జడ్పీటీసీ సభ్యురాలు యశోద శనివారం వినతి ఇచ్చారు. దీనిపై విచారణ చెరువులను, ప్రభుత్వ భూములను కాపాడాలని, భూ అక్రమణ దారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలాసపురం సర్పంచ్ టి. జోగారావు తదితరులు పాల్గొన్నారు.


