News August 18, 2024

శ్రీకాకుళం: ఇగ్నోలో అడ్మిషన్ల దరఖాస్తు గడువు పొడిగింపు

image

ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(ఇగ్నో) ద్వారా ఆన్‌లైన్, డిస్టెన్స్ లెర్నింగ్ విధానంలో పలు కోర్సులలో అడ్మిషన్లకై దరఖాస్తు చేసుకునే గడువును పొడిగించారు. ఇటీవల ఈ గడువు ముగియగా, ఆగస్టు 31 వరకు గడువు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ వర్గాలు తెలిపాయి. అడ్మిషన్ల వివరాలకు శ్రీకాకుళంలోని ఇగ్నో స్టడీ సెంటర్‌లో సంప్రదించాలని లేదా https://ignouiop.samarth.edu.in/ వెబ్‌సైట్ చెక్ చేసుకోవాలని సూచించాయి.

Similar News

News October 7, 2024

SKLM: జిల్లా పంచాయతీ అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరణ

image

జిల్లా పంచాయతీ అధికారిగా కె. భారతి సౌజన్య సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈమె కాకినాడ డీపీఓ గా పనిచేస్తూ బదిలీపై ఇక్కడకు శ్రీకాకుళం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ముందుగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను కలుసుకున్నారు. అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌ను కూడా మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

News October 7, 2024

పలాస: జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను ప్రారంభించిన ఎమ్మెల్యే గౌతు శిరీష

image

వజ్రపు కొత్తూరు మండలం ఉద్దాన రామకృష్ణాపురంలో జిల్లాస్థాయి కబడ్డీ పోటీలను పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష సోమవారం ప్రారంభించారు. క్రీడలతో శారీరక దారుఢ్యం, మానసిక ఉల్లాసం కలుగుతాయని అన్నారు. క్రీడా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు వెంకన్న చౌదరి, తదితరులు పాల్గొన్నారు.

News October 7, 2024

శ్రీకాకుళంలో ఈ నెల 9న చెస్ పోటీలు

image

శ్రీకాకుళంలో ఈనెల 9న జిల్లా స్థాయి చెస్ పోటీలు నిర్వహించనున్నారు. జిల్లా చెస్ సంఘం అధ్యక్షుడు బి. కిషోర్ ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అండర్ 15 విభాగంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.