News March 24, 2024
శ్రీకాకుళం: ఇద్దరిని చంపిన ఎలుగుబంటి మృతి?

ఉద్దానం ప్రాంతంలో నిన్న ఎలుగుబంటి ఇద్దరిని చంపిన విషయం తెలిసిందే. జీడితోటకు వెళ్లిన రైతులపై దాడి చేయగా వజ్రపుకొత్తూరు మండలం చీపురుపల్లి పంచాయతీ అనకాపల్లికి చెందిన చిడిపల్లి లోకనాథం(46), అప్పికొండ కూర్మారావు(48) చనిపోయారు. మహిళా రైతు చిడిపల్లి సావిత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఇద్దరి మరణానికి కారణమైన ఎలుగుబంటి సమీప తోటల్లో చనిపోయినట్లు సమాచారం.
Similar News
News September 7, 2025
సిక్కోలు నటుడికి SIIMA అవార్డు

ఆమదాలవలస(M) కొర్లకోటకి చెందిన నటుడు పేడాడ సందీప్ సూరజ్‌కి దుబాయ్‌లో జరిగిన SIIMA అవార్డ్స్‌లో బెస్ట్ డెబ్యూ హీరో అవార్డును శనివారం ప్రకటించారు. సూరజ్ హీరోగా నటించిన ‘కమిటీ కుర్రోళ్లు’ అనే సినిమాకి గాను అవార్డు లభించింది. దీంతో అతనికి అభిమానులు, గ్రామస్థులు అభినందనలు తెలియజేశారు. సందీప్ సరోజ్ తల్లి రమణకుమారి విశాఖ జిల్లా వైసీపీ మహిళా అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు.
News September 7, 2025
నేడు APPSC పరీక్షలు ఆధ్వర్యంలో FBO, ABO పరీక్షలు

ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో జిల్లాలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్(FBO), అసిస్టెంట బీట్ ఆఫీసర్(ABO), ఫారెస్ట్ సెలక్షన్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి పరీక్షలు ఆదివారం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జిల్లావ్యాప్తంగా సుమారు పది పరీక్ష కేంద్రాలలో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వెల్లడించారు. పరీక్షలకు మొత్తం 5186 మంది హాజరవుతారు. రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయి.
News September 7, 2025
శ్రీకాకుళం: పరీక్షా కేంద్రాల పరిశీలన

శ్రీకాకుళం జిల్లాలో ఇవాళ జరగనున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పరీక్షల ఏర్పాట్లను శనివారం ఏపీపీఎస్సీ సభ్యుడు ఎన్. సోనీ వుడ్ పరిశీలించారు. జిల్లాలోని ముఖ్యమైన మూడు కేంద్రాలతో పాటుగా ఆయా అభ్యర్థుల కోసం చేసిన ఏర్పాట్లను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు.