News December 6, 2024
శ్రీకాకుళం: ఈనెల 12 నుంచి డిగ్రీ పరీక్షలు
శ్రీకాకుళంలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ప్రధమ సంవత్సర విద్యార్థులకు ఈనెల 12వ తేదీ నుంచి మొదటి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ.. 12 నుంచి 23వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
Similar News
News December 26, 2024
శ్రీకాకుళం: దళారులను నమ్మి మోసపోవద్దు-ఎస్పీ
జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం పోలీస్ రిక్రూట్మెంట్ గురించి అధికారులతో ఎస్పీ మహేశ్వర్ రెడ్డి సమావేశమయ్యారు. పారదర్శకంగా ఎంపికలు జరుగుతాయని, దళారులను నమ్మవద్దని ఆయన సూచించారు.. శారీరిక దారుఢ్య పరీక్షలు నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు జిల్లా ఎస్పీ దిశా నిర్దేశం చేశారు. 7390 అభ్యర్థుల్లో 6215 మంది పురుషులు, 1175 మంది మహిళా పాల్గొంటారని పేర్కొన్నారు.
News December 26, 2024
శ్రీకాకుళం: దివ్యాంగులకు పెట్రోల్ సబ్సిడీ కోసం దరఖాస్తులు ఆహ్వానం
జిల్లాలో ఉన్న దివ్యాంగులకు పెట్రోల్ సబ్సిడీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ డైరెక్టర్ కె కవిత గురువారం తెలిపారు. సొంతంగా మూడు చక్రాల వాహనం కలిగిన దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. దరఖాస్తులను శ్రీకాకుళంలో తమ కార్యాలయానికి అందజేయాలని తెలిపారు. పూర్తి వివరాల కోసం తమ కార్యాలయాన్ని సంప్రదించాలని ఆమె తెలిపారు.
News December 26, 2024
శ్రీకాకుళం: బ్యాంకర్ల భాగస్వామ్యంతోనే ఆర్థిక ప్రగతి: కలెక్టర్
జిల్లా స్థాయి సమీక్షా మండలి సమావేశం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం జరిగింది. జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ స్వయం ఉపాధి పథకాల అమలు, రుణాలు మంజూరుపై చర్చించారు. ఇందులో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు.