News October 3, 2024

శ్రీకాకుళం: ఈనెల 7నుంచి బస్సు పాసుల మంజూరు

image

విద్యార్థులకు ఈనెల 7 నుంచి RTC బస్ పాసులు మంజూరు చేస్తున్నట్లు జిల్లా రవాణా అధికారి విజయ్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటి కోసం విద్యాసంస్థ నుంచి స్టడీ, బోనఫైడ్ సర్టిఫికెట్, ఆధార్ కార్డ్‌లతో apsrtcpass.in వెబ్సైట్ ద్వారా నమోదు చేసుకోవాలన్నారు. పలాస, టెక్కలి, శ్రీకాకుళం బస్ స్టేషన్లలో గల కౌంటర్ల వద్ద పాసులు పొందవచ్చని అధికారి పేర్కొన్నారు. share it.

Similar News

News October 3, 2024

SKLM: దసరాకు ప్రత్యేక బస్ సర్వీసులు

image

దసరా సందర్భంగా విశాఖ నుంచి పలు ప్రాంతాలకు 250 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలరాజు తెలిపారు. ప్రత్యేక సర్వీసులకు ఎటువంటి అదనపు ఛార్జీలు ఉండవన్నారు. హైదరాబాద్‌కు 40, విజయవాడకు 40 నుంచి 50, రాజమండ్రి, కాకినాడ సెక్టార్‌కు 40 అదనపు బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక సర్వీసులు నడుపుతామన్నారు.

News October 3, 2024

శ్రీకాకుళం: నేటి నుంచి 13 వరకు దసరా సెలవులు

image

జిల్లాలోని ఇంటర్మీడియట్ విద్యను అందిస్తున్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులను ప్రభుత్వం ప్రకటించిందని ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా ఆర్ఎఓ పి.దుర్గా రావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సెలవు రోజుల్లో విద్యార్థులు ఇంటి దగ్గర ఉండి తల్లిదండ్రులకు సహాయపడుతూ బాధ్యతగా ఉండాలని కోరారు. బైక్ రైడింగ్‌లు, బీచ్‌లకు గాని వెళ్లరాదన్నారు

News October 3, 2024

దుబాయ్‌లో సిక్కోలు యువకుడి మృతి

image

సంతబొమ్మాళి మండలం భావనపాడు గ్రామానికి చెందిన పోతుమాల అప్పన్న(37)అనే యువకుడు దుబాయిలో మృతిచెందాడు. జీవనోపాధి నిమిత్తం దుబాయిలో గ్యాస్ కంపెనీలో పనిచేస్తున్న ఈయన గత నెల 5వ తేదీన అక్కడ ప్రమాదవశాత్తు జారిపడి తీవ్రంగా గాయపడ్డాడు. అక్కడే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత నెల 19న మృతిచెందాడు. అయితే కేంద్ర, రాష్ట్ర మంత్రులు అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు చొరవతో అక్టోబర్ 1న మృతదేహం స్వగ్రామం చేరుకుంది.