News June 1, 2024
శ్రీకాకుళం: ఈ నెల 3, 4 తేదీల్లో పలు రైళ్లు రద్దు

ఈ నెల 3, 4 తేదీల్లో జిల్లా మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేస్తూ శనివారం ఈస్ట్ కోస్ట్ రైల్వే అధికారులు తెలిపారు. నౌపడ-పూండీ మెయిన్ లైన్‌లో వంతెన పనులు నేపథ్యంలో 3వ తేదీన పలాస-విశాఖ(07470)ప్యాసెంజర్, విశాఖ-గునుపూర్ (08522) ప్యాసెంజర్, విశాఖ- బరంపురం(18526), 4వ తేదీన బరంపురం-విశాఖపట్నం(18525) ఎక్స్ ప్రెస్ రైళ్లు రద్దు చేశారు. వాల్తేర్ డివిజన్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ కె.స్యాందీప్ పేర్కొన్నారు.
Similar News
News November 11, 2025
SKLM: ఛైన్ స్నాచర్ అరెస్టు..10 తులాల బంగారం స్వాధీనం

ఒంటరి మహిళలలే లక్ష్యంగా ఛైన్ స్నాచింగ్ పాల్పడిన ముహేశ్వర్ దళాయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఏడాది ఇచ్ఛాపురం, మందస, కవిటి, కాశీబుగ్గ PSలలో నిందితుడిపై దొంగతనం కేసులు నమోదవ్వగా దర్యాప్తు చేపట్టారు. ఇవాళ కాశీబుగ్గ కోసంగిపురం జంక్షన్ వద్ద ముద్దాయిని అదుపులోకి తీసుకుని 10 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దళాయ్ చెడు వ్యసనాలకు బానిసై దొంగతనాలు చేశాడని SP కేవీ మహేశ్వరెడ్డి మీడియాకు తెలిపారు.
News November 11, 2025
సమాజాభివృద్ధికి జ్ఞానం అవసరం: ఎస్పీ

సమాజాభివృద్ధికి జ్ఞానం ఎంతో అవసరమని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ తొలి విద్యామంత్రి, జ్ఞాన దీప్తి ప్రతీక అయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని మంగళవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించారు. అనంరతం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన గొప్ప ఇస్లామిక్ పండితుడని కొనియాడారు.
News November 11, 2025
చిన్నారిపై లైంగిక దాడి.. వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు

నరసన్నపేట మండలానికి చెందిన రెండో తరగతి విద్యార్థినిపై అదే గ్రామానికి చెందిన వృద్ధుడు చల్లా రామ్మూర్తి (70) లైంగిక వేధింపులకు పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. విషయాన్ని విద్యార్థిని ఆమె తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం నిందితుడిపై కేసు నమోదు చేసి, వృద్ధుడిని ఆదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ దుర్గాప్రసాద్, టెక్కలి డీఎస్పీ లక్ష్మణరావు తెలిపారు.


