News February 10, 2025

శ్రీకాకుళం: ఈ రోజు ఆదిత్యుని ఆదాయం ఎంతంటే..

image

శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం ఆదివారం  ఆదాయ వివరాలను ఈవో భద్రాజి వెల్లడించారు. స్వామివారికి టికెట్లు రూపేనా రూ.6,78,600 లు, పూజలు, విరాళాల రూపంలో రూ.1,16,454లు ఆదాయం వచ్చిందన్నారు. ప్రసాదాల రూపంలో రూ.2,68,175లు వచ్చాయన్నారు. మొత్తం రూ. 10,63,229 సమకూరినట్లు ఆయన తెలిపారు. 

Similar News

News February 10, 2025

శ్రీకాకుళంలో పెరుగుతున్న Water Melon విక్రయాలు

image

శ్రీకాకుళం జిల్లాలో వేసవి ప్రతాపం మొదలైంది. ఫిబ్రవరి నుండే వేసవిని తలపించే విధంగా భానుడు ప్రభావం చూపుతుండటంతో పగటిపూట ఎండ తీవ్రత పెరిగింది. దీంతో జిల్లాలో వాటర్ మిలాన్, పండ్లు, జ్యూస్ షాపుల్లో విక్రయాలు పెరుగుతున్నాయి. శ్రీకాకుళం, టెక్కలి, పలాస, సోంపేట తదితర ప్రాంతాల్లో ఇప్పటికే వాటర్ మిలాన్ విక్రయాలు జోరందుకున్నాయి. కాగా ఈ ఏడాది వేసవి ప్రభావం ముందుగానే కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది.

News February 10, 2025

టెక్కలి: లారీ డ్రైవర్‌కు INCOME TAX నోటీసు

image

టెక్కలి మండలం చల్లపేట గ్రామానికి చెందిన చల్లా నాగేశ్వరరావుకు రూ.1,32,99,630 కోట్లు ఆదాయ పన్ను కట్టాలని నోటీసులు వచ్చినట్లు బాధితుడు వాపోయారు. తనకు ఏడాదికి సుమారు రూ.3.97కోట్లు ఆదాయం వస్తున్నట్లు పేర్కొంటూ నోటీసు వచ్చిందన్నారు. ఈ మేరకు ఆదివారం బాధితుడి న్యాయం చేయాలని టెక్కలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తనకు, తన సోదరుడికి ఆస్తి గొడవలు ఉన్నాయని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

News February 10, 2025

పలాస: దివ్యాంగురాలిపై అత్యాచారం.. కేసు నమోదు

image

శ్రీకాకుళం జిల్లా పలాస మండల పరిధిలోని ఓ గ్రామంలో ఇటీవల ఓ దివ్యాంగురాలు గర్భం దాల్చడానికి కారణమైన వ్యక్తిపై ఆదివారం రాత్రి కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల ఆ గ్రామ పెద్దల సమక్షంలో శీలానికి వెల కట్టిన వ్యవహారం పలు పత్రికల్లో రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు కాశీబుగ్గ సీఐ తెలిపారు.

error: Content is protected !!