News November 19, 2024

శ్రీకాకుళం: ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు G.O విడుదల

image

ఉపాధ్యాయుల పని సర్దుబాటుకు సంబంధించి ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు వెలువరించింది. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా DEO ఎస్.తిరుమల చైతన్య ఒక ప్రకటనలో తెలిపారు. సర్ప్‌లెస్‌గా మిగిలిన ఉపాధ్యాయులను అవసరం ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పంపించేందుకు CSE వెబ్సైట్ ఎనేబుల్‌గా ఉందన్నారు. మండల స్థాయిలో ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ నేడు మంగళవారం, డివిజన్ స్థాయిలో కౌన్సెలింగ్ రేపు బుధవారం నిర్వహిస్తామన్నారు.

Similar News

News November 21, 2024

శ్రీకాకుళం జిల్లాలో ఐటీ పార్క్ ఏర్పాటుకు వినతి.. మంత్రి ఏమన్నారంటే?

image

ఎచ్చెర్లలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే ఈశ్వరరావు కోరారు. విశాఖకే కాకుండా ఐటీ పార్క్‌ను వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాకు సైతం విస్తరించాలని విజ్ఞప్తి చేశారు. ఎచ్చెర్లకు దగ్గరలో అంతర్జాతీయ విమానశ్రయం, హైవే కనెక్టివిటీ, విద్యాసంస్థలు ఉన్నాయన్నారు. దీనిపై మంత్రి లోకేశ్ స్పందిస్తూ.. టైర్2, టైర్ 3 సిటీల్లోనూ ఎకో వర్కింగ్ స్పేస్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

News November 21, 2024

నేడు పలాస రానున్న ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులు

image

పలాస నియోజకవర్గ పరిధిలో మినీ ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఇటీవల రెవెన్యూ అధికారులు ప్రభుత్వ స్థల పరిశీలన చేసిన విషయం తెలిసిందే. వజ్రకొత్తూరు, మందస మండలాల పరిధిలో సుమారు 1,353 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు గుర్తించారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం.. నేడు ఆ స్థలాన్ని పరిశీలించేందుకు ఎయిర్ పోర్టు అథారిటీ అధికారులు రానున్నారు.

News November 21, 2024

ఒక ఐసోలేషన్ రిఫ్రిజిరేటర్ రూ.2.04 లక్షలా: ఎమ్మెల్యే కూన

image

వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐసోలేషన్ రిఫ్రిజిరేటర్‌ల కొనుగోలులో జరిగిన అక్రమాలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే కూన రవికుమార్ అసెంబ్లీలో ప్రశ్నించారు. ‘గోద్రేజ్ కంపెనీ నుంచి కొనుగోలు చేయకుండా పక్కన పెట్టారు. ఇతర రాష్ట్రాల వారు రూ.1.30 లక్షలకే కొన్న రిఫ్రిజిరేటర్లను వైసీపీ వాళ్లు ఏకంగా రూ.2.04 లక్షలతో కొనుగోలు చేశారు. ఇందులో ఉన్న ఆంతర్యం ఏంటి. వీటిపై విచారణ చేపట్టాలి’ అని ఆయన కోరారు.