News April 20, 2024
శ్రీకాకుళం: ఎన్నికల పరిశీలకులను కలిసిన కలెక్టర్, ఎస్పీ

రాష్ట్ర ఎన్నికల వ్యయ పరిశీలకులు నినా నిగమ్ జిల్లా పర్యటనకు వచ్చారు. శనివారం ఉదయం గౌరవ పూర్వకంగా ఆమెకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజిర్ జిలాని సమూన్, ఎస్పీ జి.ఆర్.రాధిక ఆహ్వానం పలికారు. అనంతరం జిల్లాలోని అనుసరిస్తున్న ఎన్నికల నియమావళి ప్రక్రియను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల్లో ప్రతీ అధికారి అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సూచించారు.
Similar News
News April 20, 2025
నేడే మెగా డీఎస్సీ.. శ్రీకాకుళం జిల్లాలో 458 పోస్టులు

ఆదివారం ఉదయం 10 గంటలకు 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ను మంత్రి నారా లోకేష్ విడుదల చేయనున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 458 పోస్టులు కలవు. ఇందులో SA లాంగ్వేజ్-1లో 37, SA హిందీ 11, SA ఇంగ్లీష్ 65, SA మ్యాథ్స్ 33, SA-PS 14, SA-BS 34, SA సోషల్ 70, SA-PE 81, SGT 113 పోస్టులు ఉన్నాయి. ట్రైబల్ వేల్ఫేర్ ఆస్రంలో 85 పోస్టులు భర్తీ చేయనున్నారు.
News April 20, 2025
ఇచ్ఛాపురంలో నేడు కేంద్రమంత్రి పర్యటన

ఇచ్ఛాపురం నియోజకవర్గంలో నేడు(ఆదివారం) కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించనున్నారు. సోంపేట మండల కేంద్రంలో అగ్రికల్చర్ ఆఫీస్ భవనాన్ని ప్రారంభించనన్నారు. కంచిలి మండలం అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఇచ్ఛాపురం మండలంలో బెల్లుపడలో జరుగుతున్న యజ్ఞంలో పాల్గొని, అనంతరం ప్రజలు నుండి వినతులు స్వీకరిస్తారు.
News April 19, 2025
పైడిభీమవరంలో మహిళ దారుణ హత్య

రణస్థలం మండలం పరిధిలో పైడిభీమవరం పంచాయతీ గొల్లపేటకు చెందిన భవాని(26)ని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. స్థానికుల వివరాల ప్రకారం.. మృతురాలు పైడిభీమవరంలోని ఓ హోటల్‌లో పని చేస్తుంది. శనివారం సాయంత్రం హోటల్ నుంచి ఇంటికి వస్తుండగా చిన్న చాక్‌తో దుండగులు దాడి చేసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన భవాని అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు.