News April 29, 2024
శ్రీకాకుళం: ఎన్నికల విధుల్లో NCC కాడెట్లు

NCC, NSS వాలంటీర్లను ఎన్నికల విధులకు వినియోగించుకునేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సమూన్ ఆదేశించారు. వచ్చే నెల 13వ తేదీన పోలింగ్ జరిగే ఒక్కరోజు సామాజిక సేవ, స్వచ్ఛంద ప్రాతిపదికన వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా ఎస్పీ జి.ఆర్. రాధికతో కలిసి కలెక్టర్ ఛాంబర్లో సంబంధిత అధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
Similar News
News February 25, 2026
శ్రీకాకుళంలో వ్యక్తి ఆత్మహత్య

శ్రీకాకుళంలోని వాంబే కాలనీలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వన్‌టౌన్ ఎస్ఐ హరికృష్ణ వివరాల ప్రకారం.. యడగళ్ల పవన్ కుమార్ (27) ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం కుటుంబ సభ్యులకు చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో పలు చోట్ల వెతికారు. బుధవారం ఉదయం నివాసం సమీపంలోని ఇదే సముదాయంలోని 17వ నంబరు బ్లాక్‌లో ఖాళీగా ఉన్న ఇంటిలో ఉరి వేసుకొని ఉన్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
News February 25, 2026
ఎచ్చెర్ల: డిగ్రీ 6వ సెమిస్టర్ షెడ్యూల్ విడుదల..

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ యూనివర్సిటీ పరిధిలో గల డిగ్రీ 6వ సెమిస్టర్ షెడ్యూల్‌ను డీన్ డా.అనురాధ విడుదల చేశారు. ఫిబ్రవరి 27 నుంచి మార్చి 8వ తేదీ వరకు ఎటువంటి అపరాధరుసుము లేకుండా పరీక్ష ఫీజును చెల్లించవచ్చని పేర్కొన్నారు. అదేవిధంగా ఇంటర్న్ షిప్, వైవా మార్చి 17వ తేదీ నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయని చెప్పారు.
News February 25, 2026
శ్రీకాకుళం జిల్లాలో డయేరియా ప్రధాన సమస్య..

శ్రీకాకుళం జిల్లాలో వర్షాకాలంలో ప్రధానంగా సీజనల్‌గా డయేరియా కేసులు గ్రామాల్లో కనిపిస్తుంటాయి. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం, కలుషితనీరు ఒక సమస్య. నాలుగేళ్ల క్రితం శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT ) ఎస్ఎంపురం క్యాంపస్‌లో 170 మంది విద్యార్థుల వరకు డయేరియాతో బాధపడ్డారు. నీటి పరీక్షలు అనంతరం ఓ బోరును శాశ్వతంగా మూసివేశారు.


