News December 27, 2025
శ్రీకాకుళం: ఎస్పీకి దువ్వాడ ఫిర్యాదు

జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డిని శనివారం రాత్రి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. తాజాగా తనపై దాడి చేసేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారని, ఈ క్రమంలో బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఎస్పీకి దువ్వాడ వివరించారు. గతంలో కూడా తనపై దాడి చేస్తామని బెదిరిస్తూ కాల్స్ చేశారని అప్పుడు కూడా పోలీసులకు పిర్యాదు చేసినట్లు దువ్వాడ తెలిపారు. దీనిపై పరిశీలన చేసి చర్యలు తీసుకుంటామని ఎస్పీ అన్నారు.
Similar News
News January 1, 2026
2026ను స్వాగతించి..శుభాకాంక్షలు చెప్పిన ఇసుక కళాఖండం

ఎల్.ఎన్.పేట మండలం లక్ష్మీనర్సుపేట గ్రామానికి చెందిన ప్రముఖ సైకత శిల్పి ప్రసాద్ మిశ్రా వంశధార నది తీరంలో బుధవారం రూపొందించిన సైకత శిల్పం ఎంతగానో ఆకట్టుకుంటుంది. జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ 2026 ఆకృతిలో తీర్చిదిద్దిన కళారూపం చూపరులను కట్టిపడేసింది. కొత్త సంవత్సరంలో అన్ని వర్గాలకు మంచి జరగాలని ఈ ఇసుక కళాఖండంతో ఆయన ఆకాంక్షించారు.
News December 31, 2025
శ్రీకాకుళం: ఈ రైడ్ సేఫేనా?

చోదకులు హెల్మెట్ ధరించక యాక్సిడెంట్‌ల్లో ప్రాణాలొదిలిన ఘటనలు శ్రీకాకుళం జిల్లాలో తరచూ జరగుతుంటాయి. హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేస్తూ పోలీసులు అవగాహన కల్పించినా..పెడచెవిన పెట్టి మృత్యువాత పడుతున్నారు. మరి కొందరు హెల్మెట్ ఉన్నా..బైకులు పక్కన పెట్టి డ్రైవింగ్ చేయడం శ్రీకాకుళం పట్టణంలో ఇవాళ కనిపించింది. పోలీసులు, ఫైన్‌ల నుంచి తప్పించుకోవడానికి తప్ప, వ్యక్తిగత భద్రతకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు.
News December 31, 2025
9 మందికి రూ.18 లక్షల పింఛన్లు అందజేసిన మంత్రి అచ్చెన్న

గత ప్రభుత్వం హయాంలో ఆగిన 9 మందికి రూ.18 లక్షల పింఛన్లను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు బుధవారం కోటబొమ్మాళిలో అందించారు. నందిగామ మండలం దీనబంధుపురం గ్రామానికి చెందిన వీరికి మధ్యలో ఆగిపోగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అనంతరం మంజూరైన పెన్షన్లను అందజేశారు. RDO కృష్ణమూర్తి, మాజీ పీఎసీఎస్ ఛైర్మన్ వరప్రసాద్, ఎంపీడీవో ఫణీంద్ర కుమార్ ఉన్నారు.


