News January 22, 2025
శ్రీకాకుళం: ఏంటి ఈ హెలికాప్టర్ టూరిజం..!

అరసవల్లి రథసప్తమి వేడుకల్లో భాగంగా జిల్లాలో హెలికాప్టర్ టూరిజం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేపడుతున్నారు. ఈ హెలికాప్టర్ టూరిజం డచ్ బిల్డింగ్ దగ్గర హెలిపాడ్ వద్ద నిర్వహిస్తారు. అయితే ఇందులో ఆరుగురు మంది వరకు ట్రావెల్ చేయవచ్చు. దీనికి రూ.2వేలు వరకు ప్రతి ఒక్కరికి ఛార్జ్ ఉండే అవకాశం ఉంది. దీనిపై మరో రెండు మూడు రోజులు అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Similar News
News January 8, 2026
‘నూతన సమీకృత కలెక్టర్ భవన నిర్మాణాలు పూర్తి చేయాలి’

నూతన సమీకృత కలెక్టరేట్ భవనాల నిర్మాణం పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అన్నారు. ఈ మేరకు జరిగిన పనులను స్వయంగా ఆయన గురువారం పరిశీలించారు. ఇంత వరకు పూర్తికాని నిర్మాణాల గురించి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సుగుణాకర్‌ను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తి కట్టడాలను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు.
News January 8, 2026
ట్రాఫిక్ సమస్య రానీయకూడదు: ఎస్పీ మహేశ్వర్ రెడ్డి

రథసప్తమి వేడుకలు నేపథ్యంలో ట్రాఫిక్ సమస్య రానీయకూడదని ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం పరిసరాలను పరిశీలించారు. 80 అడుగుల రహదారిలో మిల్లు జంక్షన్ వద్ద వాహనాలు పార్కింగ్ చేసే స్థలాలను గుర్తించారు. భక్తులకు దర్శనాలకు రాకపోకలకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదని సిబ్బందికి సూచించారు. రద్దీ నియంత్రణకు తగు జాగ్రత్తలు వహించాలన్నారు.
News January 8, 2026
SKLM: నలుగురు ఉద్యోగులకు పదోన్నతి పత్రాలు అందజేసిన చైర్‌పర్సన్

జిల్లా పరిషత్ పరిధిలోని వివిధ కార్యాలయాలు, ఉన్నత పాఠశాలల్లో ఆఫీస్ సబార్డినేట్లుగా పనిచేస్తున్న నలుగురు ఉద్యోగులకు రికార్డు సహాయకులుగా పదోన్నతి కల్పిస్తూ జడ్పీ చైర్‌పర్సన్ పిరియా విజయ గురువారం నియామక పత్రాలు అందజేశారు. తన అధికారిక నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్.జ్యోతికుమారి (అమలపాడు), కె.పావని (బ్రాహ్మణతర్ల), హెచ్. శాంతిలక్ష్మి (బోరుభద్ర) కే ప్రసాదరావు (గొప్పిలి) పదోన్నతి పొందారు.


