News August 8, 2025

శ్రీకాకుళం ఏఎంసీ ఛైర్మన్ నియామకంపై వీడిన చిక్కుముడి

image

శ్రీకాకుళం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా జోత్స్న నియామకంపై చిక్కుముడి వీడింది. ఏఎంసీ ఛైర్మన్‌గా జోత్స్న ఎంపిక తర్వాత జనసేన, టీడీపీ పార్టీలో అసంతృప్తి రేగింన విషమం తెలిసిందే. ఆమెను వ్యతిరేకిస్తూ కొంతమంది బహిరంగంగా ఆందోళన వ్యక్తం చేశారు. అనేక సంప్రదింపులు తరువాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జోత్స్ననే ఛైర్మన్‌గా కొనసాగుతుందని కేంద్ర పార్టీ కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

Similar News

News August 8, 2025

జలుమూరు: ఉప రాష్ట్రపతికి నామినేషన్ వేసిన రాజశేఖర్

image

జలుమూరు మండలం శ్రీముఖలింగం ఆలయ ప్రధాన అర్చకులు నాయుడుగారి రాజశేఖర్ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఢిల్లీలోని ఎన్నికల కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ సమక్షంలో నామినేషన్ వేశానని శుక్రవారం ప్రకటనలో తెలిపారు. గతంలో ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా( 2019, 2024) సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేయడం జరిగిందన్నారు. 2022లో రాష్ట్రపతి పదవికి నామినేషన్ వేయడం జరిగిందన్నారు.

News August 8, 2025

బంగారు కుటుంబాలకు అండగా ఉంటాం: వైద్యులు

image

జిల్లాలోని బంగారు కుటుంబాలకు వైద్యులు అండగా నిలుస్తామన్నారు. ఈ మేరకు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌‌ను శుక్రవారం వివిధ రంగాలకు చెందిన 85 మంది శ్రీకాకుళం కలెక్టరేట్‌లో కలిశారు. అధికారులు గుర్తించిన 2,580 కుటుంబాలకు అండగా నిలుస్తామని కలెక్టర్‌కు మాటిచ్చారు. రిమ్స్ డీసిహెచ్ఎస్ కళ్యాణ్ చక్రవర్తితో పాటు, పలువురు వైద్యులు ఉన్నారు.

News August 8, 2025

శ్రీకాకుళం: 11న పాత ఎలక్ట్రానిక్ పరికరాల వేలం పాట

image

శ్రీకాకుళం మండలం తండేవలస జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో పాత ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర సామాగ్రిని వేలం వేస్తున్నట్లు ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలియజేశారు. ఆగస్టు 11వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు బహిరంగ వేలంపాట ఉంటుందని శుక్రవారం తెలిపారు. ఆసక్తి గలవారు స్టోర్ ఇన్‌ఛార్జ్ 9063477888, రిజర్వ్ ఇన్స్పెక్టర్ 6309990841 నెంబర్లలో సంప్రదించాలని చెప్పారు.