News August 14, 2025
శ్రీకాకుళం: ఒకే కాన్పులో రెండు దూడలు

శ్రీకాకుళం రూరల్ మండలం పెద్దపాడు గ్రామంలోని రామాలయం వీధిలో రైతు కృష్ణారావుకు చెందిన ఆవు ఒకే కాన్పులో రెండు దూడలకు జన్మనిచ్చింది. గురువారం జరిగిన ఈ అరుదైన సంఘటనతో రైతు ఆనందం వ్యక్తం చేశారు. ఈ రెండు దూడల్లో ఒకటి ఆడది, మరొకటి మగది అని రైతు తెలిపారు. తల్లి గోవు, 2 దూడలు ఆరోగ్యంగా ఉన్నాయని చెప్పారు. గోవును దైవంగా భావించే తనకు ఈ విషయం సంతోషాన్ని ఇచ్చిందన్నారు.
Similar News
News August 16, 2025
SKLM: ‘జిల్లా అభివృద్ధికి సమన్వయంతో పని చేయండి’

జిల్లా అభివృద్ధికి అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి శుక్రవారం ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అభివృద్ధికి కృషి చేసిన రాజకీయ నాయకులు, స్వతంత్ర సమరయోధులు త్యాగాలు మరువలేని అన్నారు.
News August 15, 2025
స్వతంత్ర్య ఫలాలు అందరికీ అందాలి: మంత్రి అచ్చన్న

స్వతంత్ర్య ఫలాలు అందరికీ అందాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. 79వ స్వతంత్ర్య దినోత్సవం సందర్భంగా శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో త్రివర్ణ పథకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు.
News August 15, 2025
స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న

శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువ గ్రామంలో స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జన్మించారు. బారువ, మందస పాఠశాలలో విద్యాభ్యాసం ముగించుకొని 21వ ఏట గాంధీజీ పిలుపుతో స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్నారు. పలు ఉద్యమాలలో పాల్గొన్న లచ్చన్న అనేకసార్లు జైలు శిక్ష అనుభవించారు. లచ్చన్న భారతదేశం స్వాతంత్ర్యం సాధించడంలో ప్రముఖ పాత్ర వహించారు. స్వాతంత్ర అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా సేవలందించారు.