News April 25, 2024
శ్రీకాకుళం: కంట్రోల్ రూం పరిశీలన

నూతన కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూంను ఇచ్ఛాపురం, పలాస, టెక్కలి, పాతపట్నం శాసన సభ నియోజకవర్గాలకు సంబంధించి వ్యయ పరిశీలకులు నవీన్ కుమార్ సోని గురువారం పరిశీలించారు. కంట్రోల్ రూంలో మీడియా సర్టిఫికేషన్ మోనిటరింగ్ కమిటీ, సోషల్ మీడియా, కంప్లైంట్ మోనిటరింగ్ సెల్, సీ-విజిల్స్ టీం, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్, బ్యాలెట్ పేపర్లు, పోస్టల్ పలు శాఖలను ఆయన పరిశీలించారు.
Similar News
News September 11, 2025
ఎల్.ఎన్.పేట: పాముకాటుతో వ్యక్తి మృతి

ఎల్.ఎన్.పేట మండలం బసవరాజుపేట గ్రామానికి చెందిన వాన అప్పలనాయుడు (45) పాముకాటుకు గురై మృతి చెందాడు. అప్పలనాయుడు గురువారం పొలంలో ఎరువులు వేస్తున్న సమయంలో కాలుకి పాము చుట్టుకుని కాటు వేసింది. పాము కాటును గుర్తించిన అప్పలనాయుడు కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. వారు వెంటనే 108 అంబులెన్స్‌లో శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
News September 11, 2025
నేపాల్‌లో తెలుగువారి కోసం కలెక్టరేట్‌లో హెల్ప్‌లైన్

నేపాల్‌లో నెలకొన్న అశాంతి పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు ప్రజలకు తక్షణ సహాయం అందించేందుకు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హెల్ప్ లైన్‌ను ఏర్పాటు చేశారు. కలెక్టర్ స్వప్నిల్ దిన్‌కర్ పుండ్కర్ ఆదేశాల మేరకు ఈ సేవలను తక్షణం అందుబాటులోకి తీసుకువచ్చారు. నేపాల్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులు ఈ నంబర్‌కు 94912 22122 ఫోన్ చేసి సహాయం పొందవచ్చన్నారు.
News September 11, 2025
గోకర్ణపురం పాఠశాలను సందర్శించిన కలెక్టర్

కంచిలి మండలం గోకర్ణపురం ఎంపీపీ పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సందర్శించారు. పాఠశాలలో రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. అనంతరం తరగతి గదుల్లో ‘యూ’ ఆకృతిలో చేపట్టిన బోధన విధానంపై ఆరా తీశారు. విద్యార్థులతో కాసేపు ముచ్చటించి, పుస్తకాలను పరిశీలించారు. పాఠశాల నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ-1 ఎస్ శివరాం ప్రసాద్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు.