News August 19, 2025
శ్రీకాకుళం: కానిస్టేబుల్ జాబ్స్‌కు ఎంపికైన అభ్యర్థులు అలెర్ట్

ఎచ్చెర్ల పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఎంపిక ప్రక్రియకు హాజరై సివిల్, APSP, SCT PC ఉద్యోగాలకు ఎంపికైన కానిస్టేబుల్ అభ్యర్థులు తండేవలస పోలీసు శిక్షణ కేంద్రం వద్ద ఈ నెల 20న హాజరు కావాలని SP మహేశ్వర రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఎంపిక సమయంలో జతపరిచిన ఒరిజినల్ సర్టిఫికెట్స్, గెజిటెడ్ అధికారితో సంతకం చేయించిన 3 సెట్ల జిరాక్స్ కాపీలు, 3 కలర్ ఫొటోలతో ఉదయం 9 గంటలకు హజరుకావాలన్నారు.
Similar News
News August 19, 2025
SKLM: క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఇంటి వద్దకే మట్టి విగ్రహం

గణేశ్ చతుర్థి వేడుకలు పర్యావరణహితంగా జరగాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన కలెక్టరేట్‌లో పర్యావరణహిత గణేశ్ చతుర్థి పోస్టర్‌ను ఆవిష్కరించారు. మట్టి వినాయక విగ్రహాలను వాడటం ద్వారా నదీ జలాలు కలుషితం కాకుండా కాపాడవచ్చని, భక్తి-ప్రకృతి రెండింటినీ కాపాడే బాధ్యత మనందరిదేనని కలెక్టర్ స్పష్టం చేశారు.
News August 19, 2025
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాలో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమీక్షా నిర్వహించారు. వర్ష నష్టాల అంచనా వెంటనే పూర్తి చేసి, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఇతర శాఖల అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు.
News August 19, 2025
శ్రీకాకుళం జిల్లాలో 1120.5 మి.మీ వర్షపాతం నమోదు

విస్తారంగా కురుస్తున్న వర్షాలు నేపథ్యంలో, మంగళవారం ఉదయం 8.30 గంటలకు శ్రీకాకుళం జిల్లాలో 1120.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ మేరకు సంబంధిత అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. అత్యధికంగా మెళియాపుట్టి మండలంలో 89.6 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు కాగా, అతి తక్కువగా కంచిలి మండలంలో 4.8 మిల్లీమీటర్లు రికార్డు అయింది.