News April 4, 2024
శ్రీకాకుళం: కొత్త పీజీ కోర్సు మంజూరు

శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ(పురుషులు) కాలేజీలో 2024-25 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ఎమ్మెస్సీ మెడికల్ బయోటెక్నాలజీ కోర్సు మంజూరైనట్లు ప్రిన్సిపల్ సురేఖ తెలిపారు. యూనివర్సిటీ వీసీ డాక్టర్ ఆర్.రజని కోర్సు అనుమతి పత్రాలను ప్రిన్సిపల్‌కు అందజేశారు. పీజీ సెట్ ద్వారా ప్రవేశం పొంది ఈ కోర్సు పూర్తి చేసిన తరువాత వైద్య, ఫార్మా రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పారు.
Similar News
News September 9, 2025
SKLM: ఆందోళన చెందవద్దు

నేపాల్ రాజధాని ఖాట్మండులో అల్లర్లు, ఆందోళనలు నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగువారు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వారి సమస్యను తెలుసుకున్న శ్రీకాకుళం MP, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు యాత్రికులకు ఆందోళన చెందవద్దు అని భరోసా కల్పించారు. వారందరిని సురక్షితంగా తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే AP భవన్ కమీషనర్ ప్రవీణ్‌తో సమీక్ష నిర్వహించారు.
News September 9, 2025
శ్రీకాకుళం: ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర మంత్రి

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తన ఓటు హక్కును మంగళవారం వినియోగించుకున్నారు. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డిలు పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఉప రాష్ట్రపతి ఎన్నికకి సంబంధించిన పోలింగ్‌ను పార్లమెంటు ప్రాంగణంలో నిర్వహించారు. పార్లమెంటు సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
News September 9, 2025
మాజీ మంత్రి సీదిరి హౌస్ అరెస్ట్

ఎరువుల కొరతపై రైతన్నకు బాసటగా వైసీపీ ‘అన్నదాత పోరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ర్యాలీ, నిరసనలకు ఎలాంటి అనుమతులు లేవన్నారు. ప్రభుత్వం ఆంక్షలు విధించి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులను బయటకు రాకుండా చేయడం అన్యాయమని సీదిరి మండిపడ్డారు.