News December 26, 2024

శ్రీకాకుళం: క్రీడాకారులకు ఎమ్మెల్యే అభినందన

image

పీఠాపురంలో ఈ నెల 18,19,20 తేదీల్లో సీనియర్ మెన్ బాక్సింగ్ టోర్నమెంట్ జరిగింది. ఈ పోటీల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన సీహెచ్ జ్ఞానేశ్వర్రావు, పి.అప్పలరాజు, హేమంత్ కుమార్‌లు గోల్డ్ మెడల్ పొందారు. వీరితో పాటు పి.విశ్వేశ్వరరావు, ఎం.లోకేష్, ఎస్.ఏసు, కె. శ్రీకాంత్, డి.మనోజ్ కుమార్‌‌లు సిల్వర్ మెడల్ సాధించి ఓవరాల్ ఛాంపియన్షిప్-2ని కైవసం చేసుకున్నారు. వీరిని బుధవారం ఎమ్మెల్యే గొండు శంకర్ అభినందించారు.

Similar News

News December 20, 2025

శ్రీకాకుళం: ‘పోలియో విజయవంతం చేయాలి’

image

రేపు జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లా ప్రజలందరూ విజయవంతం చేయాలని శ్రీకాకుళం DM&HO అనిత పేర్కొన్నారు. శనివారం సాయంత్రం ఆమె కార్యాలయ నుంచి ఏడూ రోడ్ల కూడలి వరకు ర్యాలీ ప్రారంభించారు. 0 – 5 సంవత్సరాలలోపు పిల్లలందరికి పోలియో చుక్కలు వేయించాలన్నారు. శతశాతం లక్ష్యం సాధించేలా కృషిచేయాలన్నారు. మోబైల్ టీమ్లు ప్రత్యేక బృందాలు కూడా ఉన్నాయన్నారు.

News December 20, 2025

SKLM: RTC డోర్ డెలివరీ పార్సిల్ ప్రారంభం

image

ఆర్టీసీ సంస్థలో పార్సిల్ డోర్ డెలివరీ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలనారాయణ కార్గో పార్సిల్ కౌంటర్ వద్ద శనివారం ప్రారంభించారు. 50 కేజీల బరువున్న పార్సిల్ 10 కిలోమీటర్లు దూరం పరిధిలో ఉన్న స్థలాలకు సురక్షితంగా పంపించడం జరుగుతుందన్నారు. ఈ నెల 20 నుంచి జనవరి 19 వరకు డోర్ డెలివరీ మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో 84 పట్టణాల్లో ఈ సేవలను ప్రారంభించాన్నారు.

News December 20, 2025

శ్రీకాకుళం: హాట్ హాట్‌గా జడ్పీ సర్వసభ్య సమావేశం

image

శ్రీకాకుళంలో జడ్పీ సర్వసభ్య సమావేశం హాట్ హాట్‌గా సాగుతోంది. ఉపాధి హామీ నిధుల వినియోగం, సచివాలయాలు, RBKల నిర్మాణాల పనుల బిల్లులు రాలేదని సభ్యులు ప్రశ్నించగా సంబంధిత అధికారులు బిల్లులు వచ్చాయని తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే కూన రవికుమార్ కలగజేసుకున్నారు. అయితే కేవలం వైసీపీనే టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్నారని ఆ పార్టీ సభ్యులు ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. పరస్పర ఆరోపణలతో సభ హీట్ ఎక్కింది.