News February 26, 2026

శ్రీకాకుళం: గూడ్స్ రైలు నుంచి విడిపోయిన బోగీలు

image

మందస మండలం మకరజోల వద్ద విశాఖ నుంచి కోల్‌కతా వైపునకు వెళ్తున్న గూడ్స్ రైలు ఆరు బోగీలు విడిపోయాయి. మిగిలిన బోగీలతో 100 మీటర్లు ముందుకు వెళ్లి నిలిపివేశారు. దీంతో మకరజోల మీదుగా ఉద్దానం గ్రామాలకు వెళ్లే రహదారిపై రైలు క్రాసింగ్ వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు గంటపాటు ఇబ్బందులు పడ్డారు.

Similar News

News February 28, 2026

SKLM: తగ్గుముఖం పట్టినంతవరకు వైద్య బృందం అప్రమత్తం

image

శ్రీకాకుళంలో డయేరియా పూర్తిగా తగ్గుముఖం పట్టినంత వరకు వైద్యాధికారుల బృందం అప్రమత్తంగా ఉండాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ కె.పద్మావతి అన్నారు. శనివారం దమ్మలవీధి, కాకివీధి, బోడెమ్మకోవెల, తదితర అతిసార ప్రభావిత ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. అతిసారం తగ్గుముఖం పట్టిందని ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ఆరుబయట ఆహార పదార్థాలు తినరాదని, కాచి చల్లార్చిన నీరు తాగాలన్నారు.

News February 28, 2026

SKLM: ప్రొబిషనరీ నియామకాలపై అభ్యంతరాలకు లాస్ట్ డేట్..

image

శ్రీకాకుళం జిల్లాలోని అన్ని జిల్లా పరిషత్/ప్రభుత్వ మునిసిపల్ యాజమాన్య పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రొబిషనరీ నియామకాలు చేపట్టింది. ఈ మేరకు డీఈవో రవిబాబు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. నియమాలకు సంబంధించిన వివరాలు https://www.sites.google.com/site/deosklorg/⁠లో చూసి మార్చి 7వ తేదీ లోగా అభ్యంతరాలు తెలియజేయాలన్నారు.

News February 28, 2026

SKLM: డయేరియా ప్రాంతాల్లో స్పెషల్ ఆఫీసర్స్ నియామకం

image

శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రబలిన ప్రాంతాల్లో 21 మంది ప్రత్యేక అధికారులను నియమించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శనివారం తెలిపారు. ఈ మేరకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో వార్డులో ఆరుగురు ఉద్యోగులు ఉదయం 5.30 నుంచే విధుల్లో ఉంటారని అన్నారు. డయేరియాను పూర్తిగా అరికట్టేందుకు అన్ని వార్డు సచివాలయాలకు చెందిన వివిధ శాఖల ఉన్నతాధికారులు అందుబాటులో ఉంటారన్నారు.