News December 24, 2024
శ్రీకాకుళం ఘోర ప్రమాదంలో మృతులు వీరే!
కంచిలి మండలం పెద్ద కొజ్జిరియా వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు <<14965595>>మృతి<<>> చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. విశాఖపట్నం సీతమ్మధార నుంచి ఒడిశాలోని జాజ్పూర్ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన జరిగింది. ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న కారు కరెంట్ పోల్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో విశాఖలోని సీతమ్మధారకు చెందిన కదిరిశెట్టి సోమేశ్వరరావు(48), ఎం.లావణ్య(43), స్నేహగుప్తా(18) మరణించారు.
Similar News
News December 25, 2024
SKLM: క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ
శ్రీకాకుళం జిల్లా క్రైస్తవ సోదర, సోదరీమణులకు జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర రెడ్డి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. క్రైస్తవ సోదరులు ఎంతో పవిత్రంగా భావించి క్రిస్మస్ పండగ జరుపుకోనున్న ప్రతి ఒక్కరుకి జిల్లా ఎస్పీ క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలియజేశారు. క్రిస్మస్ పండగ వేళ ప్రతి ఒకరు జీవితంలో వెలుగులు రావాలని చెప్పారు. దేవుడు మీ పట్ల దయ చూపాలని పేర్కొన్నారు.
News December 24, 2024
శ్రీకాకుళం: విజిలెన్స్ మోనిటరింగ్ నూతన కమిటీ సభ్యుడిగా వాబ యోగి
జిల్లా విజిలెన్స్ మోనిటరింగ్ నూతన కమిటీని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సోమవారం ప్రకటించారు. ఈ కమిటీల్లో భాగంగా సారవకోట మండలానికి చెందిన రాష్ట్ర ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షుడు వాబ యోగేశ్వరరావును సభ్యుడిగా నియమించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ ఎస్టీ కులం నుంచి తనను ఎంపిక చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు మంగళవారం ఉదయం కృతజ్ఞతలు తెలియజేశారు.
News December 24, 2024
SKLM: నేటి నుంచి సెలవులు
శ్రీకాకుళం జిల్లాలోని డా.బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ, బీఈడీ తదితర కాలేజీల సెలవుల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీని ప్రకారం ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు క్రిస్మస్ సెలవులని వర్శిటీ రిజిస్ట్రార్ పి.సుజాత తెలిపారు. అలాగే జనవరి 10వ తేదీ నుంచి అదే నెల 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులని.. తిరిగి కళాశాలలు జనవరి 20న రీఓపెన్ చేయాలని ఆదేశించారు.