News June 8, 2024
శ్రీకాకుళం: చంద్రబాబు ప్రమాణస్వీకార ఏర్పాట్లలో నిమగ్నమైన అచ్చెన్న

టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ఈ నెల 12న జరగనున్న చంద్రబాబు ప్రమాణస్వీకార ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం గన్నవరం విమానాశ్రయ సమీపంలోని కేసరపల్లి IT పార్క్ వద్ద ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనున్న సభాస్థలి వద్ద ఏర్పాట్లను టీడీపీ నేతలతో కలసి పరిశీలించారు. ఈ నెల 12న ఉదయం 11.27 గంటలకు చంద్రబాబు ప్రమాణస్వీకారం కార్యక్రమం ఉంటుందని అచ్చెన్న తెలిపారు.
Similar News
News November 8, 2025
టెక్కలి: యాక్సిడెంట్‌లో ఒకరు స్పాట్ డెడ్

టెక్కలి-నౌపడ రోడ్డులో రాజగోపాలపురం గ్రామం సమీపంలో శుక్రవారం అర్దరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇజ్జువరపు అప్పన్న(45)అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాజగోపాలపురం గ్రామస్థుడిగా స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
News November 8, 2025
శ్రీకాకుళం: తండ్రి మందలించాడని కుమారుడు నదిలో దూకేశాడు

శ్రీకాకుళం పట్టణంలో ఐటీఐ చదువుతున్న విద్యార్థి అలుగోలు సాయి నేతాజీ నాగావళి నదిలో శుక్రవారం అర్దరాత్రి దూకాడు. గుజరాతిపేట శివాలయం వీధికి చెందిన సాయి రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడంతో తండ్రి మందలించారు. అనంతరం బయటకు వెళ్లి ఏడురోడ్ల వంతెనపై నుంచి నాగావళి నదిలో దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు.
News November 8, 2025
కనుమరుగైన బాలి యాత్ర..పున:ప్రారంభం వెనక కథ ఇదే

శ్రీముఖలింగంలో రేపు జరిగే బాలియాత్రకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 5 వేల ఏళ్ల క్రితం వదిలేసిన యాత్రను ఇటీవల ప్రారంభించారు. మహానది-గోదావరి వరకు గల కళింగాంధ్రాను ఖౌరవేలుడు పరిపాలించాడు. ఆయన కాలంలో శ్రీముఖలింగం ఆలయ సమీపాన వంశధార నది నుంచి వర్తకులు పంటలతో ఇండోనేషియాలో బాలికి వెళ్లేవారు. వారు క్షేమంగా రావాలని కార్తీక మాసంలో అరటి తెప్పల దీపాన్ని కుటుంబీకులు నదిలో విడిచిపెట్టడమే యాత్ర వృత్తాంతం.


