News July 21, 2024
శ్రీకాకుళం జాయింట్ కలెక్టర్‌గా ఫర్మాన్ అహ్మద్ ఖాన్

జిల్లా సంయుక్త కలెక్టర్(జేసీ)గా ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌ను నియమిస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. 2020 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం అన్నమయ్య జిల్లా జేసీగా పని చేస్తున్నారు. ప్రస్తుత జేసీ ఎం.నవీన్‌ను సీఆర్డీఏ అదనపు కార్యదర్శిగా బదిలీ చేశారు. 2022 అక్టోబరు 12న నవీన్ జిల్లా జేసీగా బాధ్యతలు స్వీకరించారు.
Similar News
News November 8, 2025
మాజీ మంత్రి అప్పలరాజుకు నోటీసులు?

మాజీ మంత్రి అప్పలరాజుకు పోలీసులు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వేదికగా గతేడాది ప్రభుత్వంపై ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. వీటిపై కొందరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నిమిత్తం విచారణకు రావాలని కోరుతూ సీదిరి ఇంటికి శనివారం వెళ్లి ఆయనకు పోలీసులు నోటీసులు ఇచ్చారని సమాచారం.
News November 8, 2025
టెక్కలి: యాక్సిడెంట్లో ఒకరు స్పాట్ డెడ్

టెక్కలి-నౌపడ రోడ్డులో రాజగోపాలపురం గ్రామం సమీపంలో శుక్రవారం అర్దరాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇజ్జువరపు అప్పన్న(45)అనే వ్యక్తి మృతి చెందాడు. మృతుడు రాజగోపాలపురం గ్రామస్థుడిగా స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలుసుకున్న టెక్కలి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు.
News November 8, 2025
శ్రీకాకుళం: తండ్రి మందలించాడని కుమారుడు నదిలో దూకేశాడు

శ్రీకాకుళం పట్టణంలో ఐటీఐ చదువుతున్న విద్యార్థి అలుగోలు సాయి నేతాజీ నాగావళి నదిలో శుక్రవారం అర్దరాత్రి దూకాడు. గుజరాతిపేట శివాలయం వీధికి చెందిన సాయి రాత్రి ఇంటికి ఆలస్యంగా రావడంతో తండ్రి మందలించారు. అనంతరం బయటకు వెళ్లి ఏడురోడ్ల వంతెనపై నుంచి నాగావళి నదిలో దూకేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని రెస్క్యూ బృందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు.


