News April 5, 2025
శ్రీకాకుళం జిల్లాకు పిడుగుల ముప్పు

ప్రస్తుతం తుపాన్ ప్రభావం లేనప్పటికీ జిల్లాలో పిడుగులు పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ చెప్పారు. శనివారం సాయంత్రం అధికారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వాతావరణ శాఖ సూచనల మేరకు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని కోరారు.
Similar News
News April 6, 2025
వర్ష సూచన.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు: కలెక్టర్

శ్రీకాకుళం జిల్లాకు వర్ష సూచన, పిడుగులు పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో జిల్లా అధికారుల సెలవులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ రద్దు చేశారు. వచ్చే 48 గంటల పాటు కలెక్టరేట్‌లో 08942-20557 ఫోన్ నంబరుతో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సోంపేట మండలంలో అధిక వర్షపాతం పడే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని సూచించారు.
News April 6, 2025
టెక్కలి: ఇద్దరు ఆడపిల్లలతో అత్తింటి ముందు నిరసన

ఆడపిల్లలు పుట్టారనే నెపంతో తనను ఇంట్లోకి రానివ్వడం లేదని ఓ వివాహిత శనివారం తన అత్త వారి ఇంటి ముందు నిరసన చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి.. బుడ్డిపేటకి చెందిన మెట్ట గోపాలకృష్ణతో పోలవరం గ్రామానికి చెందిన రాణికి 2017లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. రెండేళ్లుగా రాణి తన కన్నవారింట్లో ఉంటోంది. ఈ నేపథ్యంలో అత్తవారి ఇంటికి వెళ్లగా వారు లోనికి రానివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.
News April 6, 2025
మంత్రిఅచ్చెన్నకు కాంట్రాక్ట్ ఉద్యోగుల వినతి

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుకు ఆర్ట్, క్రాఫ్ట్, వ్యాయామ కాంట్రాక్ట్ ఉద్యోగులు శనివారం రాత్రి నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో కలిశారు. పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. సమగ్ర శిక్ష అభియాన్‌లో 12 ఏళ్ల నుంచి పనిచేస్తున్న కేవలం రూ. 17 వేలను మాత్రమే చెల్లిస్తున్నారన్నారు. ప్రస్తుతం ఉన్న ధరలకు గౌరవ వేతనం చాలడం లేదని వినతి పత్రంలో పేర్కొన్నారు.