News October 17, 2024

శ్రీకాకుళం జిల్లాకు హెచ్చరికలు

image

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీరం దాటినప్పటికీ మధ్యాహ్నం వరకు సముద్రంపై ఆ ప్రభావం కొనసాగుతూనే ఉంటుందని వెల్లడించింది. సముద్ర తీరం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొంది. సాధారణ రోజుల కంటే 1.5 మీటర్ల ఎత్తు అదనంగా అలలు ఎగసిపడే అవకాశం ఉందని సూచించింది. ఈ నేపథ్యంలో ప్రజలు బీచ్‌ల వద్దకు వెళ్లకపోవడం మంచిది.

Similar News

News October 17, 2024

ట్రామాకేర్ విభాగంపై నిర్లక్ష్యం నీడలు

image

టెక్కలి జిల్లా ఆసుపత్రిలోని ట్రామాకేర్ విభాగంపై నిర్లక్ష్యం ఉందని పలువురు రోగులు వాపోతున్నారు. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి సత్వర చికిత్స అందించేందుకు ఈ విభాగం పని చేస్తుంది. ప్రస్తుతం ఈ విభాగంలో వైద్యులు, సిబ్బంది కొరత వేధిస్తోంది. దీంతో పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదని రోగులు వాపోతున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ సూర్యారావు మాట్లాడుతూ.. ట్రామాకేర్‌లో ప్రస్తుతం ఐదుగురు ఉన్నారన్నారు.

News October 17, 2024

SKLM: బాలికకు గర్భం.. యువకుడిపై కేసు 

image

బాలికను మోసం చేసిన ఓ యువకుడిపై పలు కేసులు నమోదు అయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. సారవకోట మండలానికి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో తన గ్రామంలోని బాలికకు దగ్గరయ్యాడు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న బాలికను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆమె గర్భం దాల్చినట్లు తెలిసింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో యువకుడిపై పోక్సో, అత్యాచారం, అట్రాసిటీ కేసులు నమోదు చేశామని SI అనిల్ కుమార్ తెలిపారు.

News October 17, 2024

శ్రీకాకుళం: ‘జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటుకు చర్యలు’

image

శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటివరకు నిక్షిప్తమైన సీసీ కెమెరాలు పూర్తిగా పరిశీలించి, జిల్లాలోని నిర్మానుష్యమైన ప్రదేశాలలో కొత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఎస్పీ మహేశ్వర రెడ్డి వెల్లడించారు. బుధవారం ఆయన ఎస్పీ కార్యాలయంలో మాట్లాడుతూ..జిల్లాలోని అన్ని సీసీ కెమెరాలు జిల్లా కేంద్రంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌కి అనుసంధానం చేసి నిరంతరం పర్యవేక్షణలో ఉండేటట్లు చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.