News January 8, 2026
శ్రీకాకుళం జిల్లాలో అష్ట ఈవోలేనా?

శ్రీకాకుళం జిల్లాలోని దేవాదాయశాఖలో ఈఓల(Executive Officers) కొరత ఉన్నట్లు సమాచారం. దీంతో జిల్లాలోని ప్రముఖ దేవస్థానాల్లో పర్యవేక్షణతో పాటు ఎండోమెంట్ భూముల పరిరక్షణ కొరవడుతోంది. జిల్లాలో దేవాదాయశాఖ పరిధిలో 795 ఆలయాలకు కేవలం 8 మంది ఈఓలు విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు ఈఓలు నాలుగు నెలలలో ఉద్యోగ విరమణ కానున్నారు. దీంతో దేవాదాయశాఖ అంశాల పర్యవేక్షణ మరింత క్లిష్టతరమవుతోంది.
Similar News
News February 14, 2026
అందాల పోటీల్లో మెరిసిన శ్రీకాకుళం యువతి

హైదరాబాద్ వేదికగా ఐఎల్‌ఎహెచ్‌ఇ మోడలింగ్ అండ్ ఫినిషింగ్ స్కూల్ ఆధ్వర్యంలో ఇటీవల నిర్వహించిన మిస్ గ్రాండ్ ఆంధ్రప్రదేశ్ పోటీల్లో శ్రీకాకుళం పట్టణానికి చెందిన మేఘన మెరిసింది. సెకండ్ రన్ రప్పుగా నిలిచి సత్తా చాటింది. మోడలింగ్‌పై ఆసక్తితో ఈ రంగంలోకి వచ్చినట్లు ఆమె చెప్పారు. పలువురు ఈ యువతిని అభినందించారు.
News February 14, 2026
శ్రీముఖలింగేశ్వరుని ఉత్సావాల కార్యక్రమాలివే!

శ్రీముఖలింగం దేవాలయం మహా శివరాత్రి వేడుకలకు ముస్తాబు అయింది . ఈనెల15-18 వరకు వేడుకలు జరగనున్నట్లు దేవాదాయ శాఖాధికారులు చెప్పిన విషయం తెలిసిందే. ఆలయంలో 15న మహాశివరాత్రి జాగారం, 16న పడియా, 17న మహా పడియా, 18న వంశధార నదిలో శ్రీముకలింగేశ్వరుని చక్రతీర్థ స్నానాలు జరగనున్నాయి. లక్షలాది భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉత్సావాలు విజయవంతమయ్యేలా ఏర్పాట్లను యంత్రాంగం చేపట్టింది.
News February 14, 2026
శ్రీకాకుళం: పెరిగిన జీతాలు.. హర్షం వ్యక్తం చేసిన 108 సిబ్బంది

సీఎం చంద్రబాబు నాయుడు 108 సిబ్బంది జీతాలను పెంచుతూ తీసుకున్న నిర్ణయంపై వారు సర్వత్ర హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఈఎంటీలు 79, పైలెట్లు 79 మందికి ఈ నిర్ణయంతో వీరికి రూ.2,000లు అదనంగా వేతనం కలిపి అందనుంది. అంతేకాకుండా 5, 10 సంవత్సరాల్లో సర్వీస్ చేసిన వారికి ఆటోమెటిక్ స్లాబ్ అప్ గ్రేడేషన్ చేయడంతో సిబ్బంది ఆనందం వ్యక్తం చేశారు.


