News March 3, 2025

‘శ్రీకాకుళం జిల్లాలో ఐటీడీఏ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు’

image

ఏపీ అసెంబ్లీలో శ్రీకాకుళం ఎమ్మెల్యేలంతా ఐటీడీఏ ఏర్పాటుపై ముక్తకంఠంగా ప్రశ్నించారు. పాతపట్నం,పలాస,టెక్కలి, నరసన్నపేట నియోజకర్గాల్లో గిరిజనులు ఎక్కువగా ఉన్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉమ్మడి జిల్లాలో ఉన్న సీతంపేట ఐటీడీఏ పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్లిపోయిందని తెలిపారు. జిల్లాలో ఐటీడీఏ ఎప్పుడు ఏర్పాటు చేస్తారో చెప్పాలని గౌతు శిరీష, కూన రవి, బగ్గు రమణమూర్తి, గొండు శంకర్ డిమాండ్ చేశారు.

Similar News

News March 4, 2025

టెక్కలి పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ ఆకస్మిక తనిఖీలు

image

టెక్కలి పోలీస్ స్టేషన్‌లో సోమవారం జిల్లా ఎస్పీ కె.వి మహేశ్వరరెడ్డి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా తొలుత స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. నూతన మోటార్ వెహికల్ చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ సిబ్బందికి చెప్పారు. రోడ్డు ప్రమాదాలు, సైబర్ మోసాలు, అసాంఘిక కార్యకలాపాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.

News March 3, 2025

శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలకు 337 మంది డుమ్మా

image

ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. శ్రీకాకుళం జిల్లాలో 74 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతుండగా.. సోమవారం జరిగిన తెలుగు/ సంస్కృతం పరీక్షకు 337 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఆర్ఐఓ పీ.దుర్గారావు తెలిపారు. ద్వితీయ సంవత్సరం పరీక్షకు 18,782 మంది హాజరు కావాల్సి ఉండగా.. 18,445 మంది హాజరయ్యారని ఆయన తెలిపారు.

News March 3, 2025

శ్రీకాకుళం : ప్రయాణికులకు అలర్ట్..ఆ రైళ్ల నంబర్లు మారాయ్..!

image

పలాస, శ్రీకాకుళం రోడ్ మీదుగా ప్రయాణించే 2 రైళ్లకు నూతన నంబర్లు కేటాయించామని రైల్వే అధికారులు తెలిపారు. ఈ మేరకు భువనేశ్వర్(BBSR)- పుదుచ్చేరి(PDY) సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లకు(వీక్లి) ప్రస్తుత నంబర్లు 12898/12897 స్థానంలో 20851/20852 నంబర్లు ఉంటాయన్నారు. BBSR- PDY రైలు ఈ నెల 4 నుంచి, PDY- BBSR రైలు ఈ నెల 5 నుంచి నూతన నంబర్లతో ప్రయాణిస్తాయని తాజాగా ఓ ప్రకటన విడుదల చేశారు.

error: Content is protected !!