News June 6, 2024

శ్రీకాకుళం జిల్లాలో కాంగ్రెస్‌‌ కంటే నోటాకే ఎక్కువ ఓట్లు

image

శ్రీకాకుళం జిల్లాలో ఈసారి నోటాకు ఓట్లు భారీగా నమోదయ్యాయి. అముదాల వలస, టెక్కలి, ఇఛ్చాపురం, పాతపట్నం, శ్రీకాకుళం, పలాస నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులకంటే నోటాకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. 2019 ఎన్నికల్లో ఎచ్చెర్లలో అత్యధికంగా, ఆముదాల వలసలో అత్యల్పంగా ఓట్లు పడ్డాయి. ఈసారి శ్రీకాకుళం అసెంబ్లీ స్థానంలో 4,270 ఓట్లు నోటాకు పడటం గమనార్హం. అయితే అత్యల్పంగా ఇఛ్చాపురంలో 744 ఓట్లు పోల్ అయ్యాయి.

Similar News

News September 29, 2024

దూసి: గాంధీ పర్యటించిన రైల్వే స్టేషన్‌లో స్థూపం ఏర్పాటు

image

దూసి రైల్వే స్టేషన్‌లో మహాత్మ గాంధీ స్మారక స్థలి ఏర్పాటు చేసేందుకు విశాఖ ఇంటాక్ట్ సంస్థ ప్రతినిధులు సిద్థంగా ఉన్నారని తెలిపారు. ఆ విషయమై పరిశీలించడానికి వచ్చామని సీనియర్ డీసీఎం ఈస్ట్ కోస్ట్ వాల్తేరు డివిజన్ అధికారి పవన్ కుమార్ అన్నారు. శనివారం ఉదయం దూసి రైల్వే స్టేషన్‌ను పలువురు అధికారులతో కలిసి సందర్శించి మహాత్మ గాంధీ పర్యటించిన ప్రదేశాన్ని పరిశీలించారు. దూసి రైల్వే స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

News September 29, 2024

అట్రాసిటీ చట్టం పగడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్ దినకరన్

image

SC, ST అట్రాసిటీ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దినకరన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం పౌర హక్కుల పరిరక్షణ, అత్యాచార నిరోధక చట్టం పై నిర్వహించిన సమావేశంలో ఎస్పీ మహేశ్వర రెడ్డితో కలిసి మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న అట్రాసిటీ కేసులను పరిష్కరించాలని చెప్పారు. కమిటీలోని 8 మంది నూతన సభ్యుల నియామకానికి వెంటనే నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించారు.

News September 28, 2024

జాతీయస్థాయి హాకీ పోటీలకు సిక్కోలు క్రీడాకారిణి

image

శ్రీకాకుళం రూరల్ మండలం పాత్రునివలస గ్రామానికి చెందిన చింతాడ చిన్ని జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 30 నుంచి వచ్చే నెల 10 వరకు ఝార్ఖండ్ రాష్ట్రం రాంచి పట్టణంలో జరగనున్న 14వ హాకీ ఇండియా జూనియర్ మహిళా జాతీయ స్థాయి పోటీలకు ఏపీ తరపున పాల్గొంటానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆమెను అభినందిస్తున్నారు.