News April 13, 2025

శ్రీకాకుళం జిల్లాలో చికెన్ ధరలు ఎంతంటే

image

శ్రీకాకుళంలో చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ఆదివారం బాయిలర్ లైవ్ రూ.150, డ్రెస్డ్ రూ. 255, స్కిన్ లెస్ రూ. 275 ధరలు ( కేజీల్లో) ఉన్నాయి. ఇటీవల బర్డ్ ఫ్లూ కారణంగా విపరీతంగా తగ్గిన ధరలు మళ్లీ ఊపందుకున్నాయి. ఇప్పటికే చికెన్ ప్రియులు షాపుల వద్ద బారులు తీరారు. ఆదివారం కావడంతో జిల్లాలో ముమ్మరంగా చికెన్ అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాలలో కూడా స్వస్ప వ్యత్యాసంతో ఇదే ధరలు ఉన్నాయి.

Similar News

News April 14, 2025

శ్రీకాకుళంలో సైనిక్ భవన్ శంకుస్థాపన 

image

శ్రీకాకుళం కేంద్రంలో రాగోలులో సైనిక్ భవన్‌ నిర్మాణం సోమవారం జరిగింది. కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు భూమి పూజలకు హాజరై శంకుస్థాపన చేశారు. వీరితో పాటు ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఉన్నత అధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ సైనకులు పాల్గొన్నారు.

News April 14, 2025

శ్రీకాకుళం: ఇంటర్మీడియట్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థిని

image

శ్రీకాకుళం ప్రభుత్వ బీసీ బాలికల కళాశాల వసతి గృహం-4 లో చదువుతున్న విద్యార్థిని చెన్నంశెట్టి జ్యోతికి ఇంటర్మీడియట్‌ MLTలో 984 మార్కులు సాధించినట్లు సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ, శ్రీకాకుళం డివిజన్ అధికారి జి.చంద్రమౌళి సోమవారం తెలిపారు. హాస్టల్ నుంచి ఇంటర్‌ సెకండియర్‌లో 13మందికి 900 కు పైగా, ఫస్ట్ ఇయర్‌లో 11 మంది విద్యార్థులకు 450కి పైగా మార్కులు వచ్చాయన్నారు.

News April 14, 2025

శ్రీకాకుళం: నదిలో పడవపై నుంచి జారిపడి మత్స్యకారుడి మృతి

image

శ్రీకాకుళం రూరల్ మండలం గనగళ్లవానిపేట మొగ వద్ద నాగావళి నదిలో పడవపై నుంచి జారిపడి మత్స్యకారుడు మృతి చెందిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే గనగళ్లవానిపేట గ్రామానికి చెందిన పుక్కళ్ల గణేశ్ (40) ఆదివారం చేపల వేటకు పడవపై వెళ్లి ఆయన జారిపడ్డాడు. ఎడమ చేతికి తాడు కట్టుకొని ఉండడం వలన వల లాగడంతో ఒడ్డుకు చేరలేక నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ శ్రీకాకుళం రూరల్ ఎస్సై రాము కేసు నమోదు చేశారు.

error: Content is protected !!