News October 11, 2025

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

✯సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: ఎమ్మెల్యే శంకర్
✯డయాలసిస్ సేవలు సకాలంలో అందించాలి: జడ్పీ చైర్‌పర్సన్
✯ఇరిగేషన్ అధికారులపై ఎమ్మెల్యే కూన ఆగ్రహం
✯కూటమితోనే అభివృద్ధి సాధ్యం: ఎమ్మెల్యే అశోక్
✯ లక్ష్మీపురంలో కుక్కల స్వైరవిహారం
✯జిల్లాలో పలుచోట్ల సూపర్ జీఎస్టీపై అవగాహన
✯పొందూరు: భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి

Similar News

News October 11, 2025

టెక్కలి: అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

image

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక భాగంలోని తోటలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తోటలో వేలాడుతున్న వ్యక్తి టెక్కలిలోని ఎన్టీఆర్ కాలనీ 9వ లైన్‌లో నివాసముంటున్న గణపతి(50)గా గుర్తించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాము కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

News October 11, 2025

SKLM: ‘సామాజిక న్యాయానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది’

image

సామాజిక న్యాయానికి కూటమి ప్రభుత్వం పట్టుబడి ఉందని ఆముదాలవలస, శ్రీకాకుళం నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూన, రవికుమార్ గొండు శంకర్ అన్నారు. జిల్లాకలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ, ఎస్టీ కులాలకు సంబంధించి ప్రివెన్షన్ ఆక్ట్‌పై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎస్సీ,ఎస్టీలకు ఎటువంటి అన్యాయం జరిగినా తక్షణం చర్యలు తీసుకోవాలని వారు అధికారులను ఆదేశించారు. గతంలో జరిగిన ఘటనపై అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News October 10, 2025

SKLM: కత్తర్లో రూ.లక్ష ఇరవై వేలతో యువతకు ఉద్యోగాలు

image

కత్తర్లో రూ లక్ష ఇరవై వేలతో అర్హులైన యువతీ యువకులకు హోమ్ కేర్ నర్స్ ఉద్యోగాలు ప్రభుత్వం కల్పిస్తుందని మైనారిటీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమారస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ నర్సింగ్, జీఎన్ఎం పూర్తి చేసి రెండేళ్లు అనుభవం ఉండాలని చెప్పారు. 21-40 ఏళ్లు ఉన్నవారు వెబ్ సైట్‌లో https://naipunyam.ap.gov.in/user-registration దరఖాస్తు చేసుకోవాలన్నారు.