News June 4, 2024
శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరుల ఘోర ఓటమి
శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన సోదరులు పరాజయం పాలయ్యారు. శ్రీకాకుళం వైసీపీ అభ్యర్థి మంత్రి ధర్మాన ప్రసాదరావు, టీడీపీ అభ్యర్థి గొండు శంకర్ పై, నరసన్నపేట వైసీపీ అభ్యర్థిగా ధర్మాన కృష్ణదాస్, టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తిపై ఓడిపోయారు. అలాగే పలాస వైసీపీ అభ్యర్థి మంత్రి సీదిరి అప్పలరాజు టీడీపీ అభ్యర్థి గౌతు శిరీషపై వెనుకంజులో ఉన్నారు.
Similar News
News November 27, 2024
మందస: బుడంబో గ్రామ సమీపంలో పులి కలకలం
మందస మండలం, సాబకోట పంచాయితీ, బుడంబో గ్రామ సమీపాన పులి సంచరిస్తున్నట్లు మంగళవారం కలకలం రేగింది. మంగళవారం మధ్యాహ్నం స్కూటీపై మందస వెళ్లి తిరిగి సాబకోట వెళ్తుండగా చిన్న బరంపురం నుంచి బుడంబో వెళ్లే తారు రోడ్డులో పులి రోడ్డు దాటుతుండగా చూసినట్లు మదన్మోహన్ బెహరా అనే వ్యక్తి సాబకోట సచివాలయానికి వెళ్లి సమాచారం అందజేశారు. సచివాలయ సిబ్బంది పులి సంచారంపై అటవీశాఖ అధికారులకు సమాచారం అందజేశారు.
News November 27, 2024
రూ.25 కోట్లకు పైగా అవినీతి సొమ్ము దాచిన శ్రీకాకుళం జిల్లా అధికారి
విశాఖకు చెందిన సింహాచలం విశాఖపట్నం జోన్-2 మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల కలిగి ఉన్నారని అభియోగంపై ACB మంగళవారం కేశవరావుపేట, కింతలి, శ్రీకాకుళం టౌన్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ప్రస్తుతం గుర్తించిన ఆస్తుల రూ.25కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. బంగారు, భూములు గుర్తించారు. విశాఖ, శ్రీకాకుళంలో ACB బీనామిలు, కుటుంబ సభ్యుల ఇంట్లో దాడులు నిర్వహించారు.
News November 26, 2024
పలాస: ఉరేసుకుని జవాన్ భార్య ఆత్మహత్య
పలాస మండలం ఈదురాపల్లిలో మీరజాక్షి (21) అనే మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మెళియాపుట్టి(M) టకోయిగాతలవలస గ్రామానికి చెందిన మీరజాక్షికి 7 నెలల క్రితం ఈదురాపల్లి చెందిన జవాన్ వినోద్‌తో వివాహమైంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వారం క్రితం ఇదే గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ జవాన్ భార్య సూసైడ్ చేసుకున్నారు.