News October 2, 2024

శ్రీకాకుళం జిల్లాలో నేటి నుంచి దసరా సెలవులు

image

శ్రీకాకుళం జిల్లాలోని అన్ని పాఠశాలలకు అక్టోబర్ 2 (బుధవారం) నుంచి 13వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డా. తిరుమల చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ దసరా సెలవుల్లో… బీచ్ లకు వెళ్లకుండా చూసుకోవాలన్నారు. అలాగే వారికి బైకు ఇవ్వరాదని దానివల్ల ప్రమాదాలు ఉంటాయని సూచించారు.

Similar News

News October 2, 2024

స్వచ్ఛ శ్రీకాకుళం లక్ష్యం : రామ్మోహన్ నాయుడు

image

స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణం ప్రతి ఒక్కరి లక్ష్యంగా ముందుకు సాగాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం నగరంలోని కలెక్టరేట్ ఆవరణలో జరిగిన స్వచ్ఛతా హీ సేవా అవార్డుల ప్రదానం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ శ్రీకాకుళం నిర్మాణంలో ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాలని ప్రతిజ్ఞ చేశారు.అనంతరం నగరంలో సైకిల్ తొక్కుతూ అవగాహన కల్పించారు.

News October 2, 2024

శ్రీకాకుళం: గిల్టు నగలకు రూ.16 లక్షల రుణం

image

శ్రీకాకుళంలోని ఓ బ్యాంకులో అప్రైజర్‌ అవినీతి చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచారం మేరకు..గిల్ట్ నగలు తన బంధువుల పేర్ల మీద తాకట్టు పెట్టి రూ.16 లక్షల రుణం తీసుకున్నారు. గుర్తించిన అధికారులు రూ.1.50 లక్షలు రికవరీ చేయగా..మిగిలింది కట్టకుండా కాలయాపన చేస్తుండడంతో సిబ్బంది అతనిపై ఫిర్యాదు చేయాలనుకున్నారు. మంగళవారం పోలీసులను ఆశ్రయించగా పూర్తి వివరాలు లేవని ఫిర్యాదు తీసుకోలేదని ఎచ్చెర్ల సీఐ తెలిపారు.

News October 2, 2024

ఆమదాలవలస: మహాత్మా గాంధీ నాటిన మొక్క నేడు మహా వృక్షం

image

క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో ఉద్యమకారుల్లో స్ఫూర్తి నింపేందుకు మహాత్మా గాంధీ ఆమదాలవలస మండలం దూసి రైల్వే స్టేషన్‌కు 1942లో చేరుకున్నారు. అక్కడ రైల్వే స్టేషన్‌లో దిగి సమరయోధులతో స్వాతంత్ర్య కాంక్షపై మాట్లాడారు. అనంతరం ఒక మర్రి మొక్కను నాటారు. నేడు అది మహావృక్షంగా మారింది. ఈ వృక్షానికి 82 ఏళ్లు వయసైందని దూసి గ్రామస్థులు చెబుతున్నారు.