News March 7, 2025
శ్రీకాకుళం జిల్లాలో ఫ్రీ బస్.. మీ కామెంట్

RTC ఉచిత బస్సు ప్రయాణాన్ని జిల్లా వరకే పరిమితం చేస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు. శ్రీకాకుళం వాసులు ఎక్కువగా విశాఖ, విజయనగరం జిల్లాలకు వెళ్తుంటారు. విశాఖలో ఇంజినీరింగ్ కాలేజీలు ఉండటంతో విద్యార్థినీలు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. మంత్రి ప్రకటన మేరకు వీరంతా విశాఖ, విజయనగరం వెళ్లాలంటే టికెట్ కొనాల్సిందే. ఇలా జిల్లా బార్డర్‌లో ఉండే వారికి ఉచిత ప్రయాణం వర్తించదు. దీనిపై కామెంట్.
Similar News
News April 23, 2025
SKLM: క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించిన DIG

విశాఖపట్నం రేంజ్ పరిధిలో గల జిల్లాల ఎస్పీలతో DIG గోపినాథ్ జెట్టి క్రైమ్ రివ్యూ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం జిల్లా ఎస్పీ మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు. దీనిలో భాగంగా గోపినాథ్ జెట్టి మాట్లాడుతూ.. గంజాయి రవాణాపై నియంత్రణ కోసం చెక్‌పోస్ట్‌ల వద్ద నిఘా ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు నిర్వహించాలన్నారు.
News April 22, 2025
శ్రీకాకుళం: అమ్మా నేనొస్తున్నా అంటూనే..!

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం లొద్దపుట్టి RH కాలనీలో విషాదం నెలకొంది. గ్రామానికి చెందిన నెయ్యల గోపాల్ తగరపువలసలోని అవంతి ఇంజినీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. ‘అమ్మా.. నేను ఇంటికి వస్తున్నా’ అంటూ తల్లికి కాల్ చేశాడు. ఎంతకీ ఇంటికి రాకపోవడంతో కాలేజీలో సంప్రదించారు. విజయనగరం రైల్వే స్టేషన్ పరిసరాల్లో గోపాల్ అనుమానాస్పదంగా చనిపోయాడని కాలేజీ ప్రతినిధులు తల్లికి చెప్పడంతో బోరున విలపించారు.
News April 22, 2025
సివిల్ సర్వీసులో మెరిసిన చిక్కోల్ యువకుడు

కోటబొమ్మాలి మండలం చలమయ్యపేటకు చెందిన లింగుడు జోష్ సివిల్ సర్వీస్ పరీక్షల్లో సత్తా చాటారు. మంగళవారం విడుదలైన సివిల్ సర్వీస్ ఫలితాల్లో 790 ర్యాంక్ సాధించాడు. ఇతని తండ్రి బాలయ్య మాజీ సైనిక ఉద్యోగి, తల్లి రాజ్యలక్ష్మి. దీంతో జోష్‌ను పలువురు అభినందించారు.