News December 28, 2025

శ్రీకాకుళం జిల్లాలో మాంసం ధరలు ఇలా.!

image

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. చికెన్ లైవ్ రూ.165 కాగా, స్కిన్ చికెన్ రూ.285, స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.305గా ప్రాంతాన్ని బట్టి నమోదైంది. దీంతో ఆదివారం మాంసాహార ప్రియులకు నిరాశ ఎదురైంది. వారం రోజుల వ్యవధిలో చికెన్ ధరలు సుమారు రూ.40 పెరగడంతో చర్చనీయాంశంగా మారింది. మరి మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.

Similar News

News December 29, 2025

శ్రీకాకుళం: ముక్కోటి ఏకాదశి.. ముస్తాబైన వైష్ణవ ఆలయాలు

image

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే ‘మార్గం’ మధ్య ఈ ముక్కోటి ఏకాదశి వస్తుంది. ముక్కోటి ఏకాదశి సందర్భంగా నగరంలోని వైష్ణవాలయాలు ఆధ్యాత్మిక శోభతో ముస్తాబయ్యాయి. అరసవిల్లి, శ్రీకూర్మం, నారాయణ తిరుమల ఆలయాలలో ఉత్తర ద్వార దర్శనాలకు ఏర్పాట్లు చేశారు.

News December 29, 2025

శ్రీకాకుళం అభివృద్ధికి కేంద్రమంత్రి భరోసా

image

శ్రీకాకుళం నగరం కార్పొరేషన్ స్థాయిలో అభివృద్ధి చెందుతోందని కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో కలిసి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన, నగరంలో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. డే అండ్ నైట్ జంక్షన్ నుంచి రామలక్ష్మణ జంక్షన్ వరకు ఉన్న రహదారిని 80 అడుగుల రోడ్డుగా విస్తరించి ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు.