News July 31, 2024

శ్రీకాకుళం జిల్లాలో 88.34 శాతం ఇంజినీరింగ్ ప్రవేశాలు

image

ఏపీఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ కళాశాలలో ప్రవేశానికి తొలి విడత కౌన్సెలింగ్ ఈనెల 23 నుంచి 27వ తేదీ వరకు నిర్వహించిన విషయం తెలిసింది. ఈ మేరకు కౌన్సిలింగ్ అలాట్ మెంట్లు మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లాలో నాలుగు ఇంజనీరింగ్ కళాశాలలు ఉండగా మొదటి విడతలో 2154 సీట్లకు 1847 ప్రవేశాలు జరిగాయి. అనంతరం తుది విడతలో 1903 మంది అభ్యర్థులకు ప్రవేశాలు జరిగాయి. మొత్తం జిల్లాలో 88.34 శాతం ప్రవేశాలు జరిగాయి.

Similar News

News November 27, 2024

రూ.25 కోట్లకు పైగా అవినీతి సొమ్ము దాచిన శ్రీకాకుళం జిల్లా అధికారి

image

విశాఖకు చెందిన సింహాచలం విశాఖపట్నం జోన్-2 మున్సిపల్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. ఆయనపై ఆదాయానికి మించి ఆస్తుల కలిగి ఉన్నారని అభియోగంపై ACB మంగళవారం కేశవరావుపేట, కింతలి, శ్రీకాకుళం టౌన్ ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ప్రస్తుతం గుర్తించిన ఆస్తుల రూ.25కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. బంగారు, భూములు గుర్తించారు. విశాఖ, శ్రీకాకుళంలో ACB బీనామిలు, కుటుంబ సభ్యుల ఇంట్లో దాడులు నిర్వహించారు.

News November 26, 2024

పలాస: ఉరేసుకుని జవాన్ భార్య ఆత్మహత్య

image

పలాస మండలం ఈదురాపల్లిలో మీరజాక్షి (21) అనే మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మెళియాపుట్టి(M) టకోయిగాతలవలస గ్రామానికి చెందిన మీరజాక్షికి 7 నెలల క్రితం ఈదురాపల్లి చెందిన జవాన్ వినోద్‌తో వివాహమైంది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వారం క్రితం ఇదే గ్రామంలో కుటుంబ కలహాలతో ఓ జవాన్ భార్య సూసైడ్ చేసుకున్నారు.

News November 26, 2024

త్రిపురాన విజయ్ నేపథ్యం ఇదే..!

image

శ్రీకాకుళం జిల్లా యువకుడు IPLకు ఎంపికైన విషయం తెలిసిందే. టెక్కలికి చెందిన త్రిపురాన వెంకటకృష్ణరాజు, లావణ్య దంపతుల కుమారుడు విజయ్‌కు మొదటి నుంచి క్రికెట్ ఆసక్తి. ఈక్రమంలో పలు పోటీల్లో సత్తాచాటాడు. సోమవారం జరిగిన ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ అతడిని రూ.30లక్షల బేస్ ప్రెస్‌‌కు దక్కించుకుంది. విజయ్ తండ్రి వెంకటకృష్ణరాజు సమాచారశాఖ ఉద్యోగి, తల్లి లావణ్య గృహిణి. విజయ్‌కు పలువురు అభినందనలు తెలిపారు.