News August 21, 2025

శ్రీకాకుళం జిల్లా పశువైద్యాధికారికి రాష్ట్ర స్థాయి పురస్కారం

image

మూగజీవాల వైద్య సేవలో విశేష సేవలందించినందుకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన డా. లిఖినేని కిరణ్ కుమార్ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పశువైద్యాధికారి పురస్కారం అందుకున్నారు. బుధవారం విజయవాడలోని పశుసంవర్ధక శాఖ కార్యాలయంలో డైరెక్టర్ దామోదర్ నాయుడు ఆయనకు ఈ అవార్డును శాలువాతో సన్మానించి బహుకరించారు. పశువైద్య రంగంలో చేసిన కృషికి మరింత గుర్తింపు లభిస్తుందని అధికారులు అభినందించారు.

Similar News

News August 20, 2025

జలుమూరు: ఉపరాష్ట్రపతి పోటీలో నాయుడు గారి రాజశేఖర్ నామినేషన్ ఆమోదం

image

భారత ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసిన నాయుడు గారి రాజశేఖర్ నామినేషన్ బుధవారం రాజ్యసభ ఎన్నికల అధికారి ఆమోదించారు. నామినేషన్ అనుమతి పత్రం అందుకున్నట్లు రాజశేఖర్ తెలిపారు. ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తాను పోటీ చేసే ప్రధాన కారణం తన గ్రామాన్ని ఢిల్లీ స్థాయిలో గుర్తింపు తీసుకురావడమేనని చెప్పారు. దక్షిణకాశీగా పేరుగాంచిన పవిత్ర శ్రీముఖలింగ క్షేత్ర అభివృద్ధి కోసం కృషి చేస్తానని రాజశేఖర్ స్పష్టం చేశారు.

News August 20, 2025

ట్రంప్ నిర్ణయాలతో ఆక్వా ఎగుమతులకు దెబ్బ: పివిఎన్ మాధవ్

image

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన బీజేపీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నిర్ణయాల వల్ల ఐదు వేల కోట్ల రూపాయల ఆక్వా కల్చర్ ఉత్పత్తులు ఎగుమతులకు నోచుకోలేకపోయాయని తెలిపారు. సముద్రంలోనే అవి నిలిచిపోయాయని అన్నారు. నేటి సమాజానికి స్వదేశీ ఉద్యమం మళ్లీ రావాలని ఆకాంక్షించారు.

News August 20, 2025

ఎచ్చెర్ల: డిగ్రీ 2వ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు విడుదల

image

డా. బీ ఆర్ అంబేడ్కర్ యూనివర్శిటీ డిగ్రీ రెండవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ మేరకు వర్శిటీ ఎగ్జామ్స్ యూజీ డీన్ డా. జి. పద్మారావు ఓ ప్రకటనలో తెలిపారు. 2024-25 ఏడాదికి సంబంధించి ఏప్రిల్‌లో జరిగిన డిగ్రీ 2వ సెమిస్టర్ పరీక్షలకు మొత్తం 5,957 మంది విద్యార్థులు హాజరు కాగా 37.58 శాతం మంది ఉత్తీర్ణత చెందారన్నారు. రిజల్ట్స్‌ను జ్ఞానభూమి పోర్టల్‌లో చూడాలన్నారు.