News April 9, 2025

శ్రీకాకుళం జిల్లా వాసుల తలపై గుది బండ

image

గ్యాస్ ధరల పెంపు సామాన్యుడి తలపై గుది బండలా మారింది. గృహ అవసరాలకు వాడే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ఏకంగా రూ. 50 పెరగడంతో.. రూ. 878.50 కి చేరింది. మన శ్రీకాకుళం జిల్లాలో 6.92 లక్షలకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. పెంచిన ధరతో నెలకు రూ. 3.46 కోట్లకు పైగా ప్రజలపై భారం పడనుంది. వాణిజ్య పనులకు ఉపయోగించే గ్యాస్ సిలిండరుపై రూ. 40 పెరిగింది.

Similar News

News April 17, 2025

శ్రీకాకుళం: భద్రతపై ఈవీఎం నోడల్ అధికారి సంతృప్తి

image

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈవీఎంల భద్రతా ఏర్పాట్లపై జిల్లా కలెక్టరేట్‌లోని గోదాంను రాష్ట్ర ఈవీఎం నోడల్ అధికారి విశ్వేశ్వరరావు గురువారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచనల మేరకు ఈ తనిఖీలు చేపట్టామన్నారు. గోదాములో అమలులో ఉన్న ట్రిపుల్ లాక్ విధానం, 24 గంటల సీసీటీవీ పర్యవేక్షణ, భద్రతా ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

News April 17, 2025

శ్రీకాకుళం: మత్స్యకార ఆర్థిక భరోసాపై ఎన్యుమరేషన్

image

శ్రీకాకుళం జిల్లాలో ఉన్న మత్స్యకారులకు రూ. 20 వేల ఆర్థిక భరోసాకు శుక్రవారం నుంచి ఎన్యుమరేషన్ చేస్తామని జిల్లా ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ గురువారం తెలిపారు. జిల్లాలోని ఇచ్ఛాపురం నుంచి రణస్థలం వరకు ఉన్న మత్స్యకారుల వివరాలు సేకరిస్తామన్నారు. నాటు పడవలో ఎంతమంది సముద్రంలో వేట చేస్తున్నారు. మోటార్ బోర్డుపై వేట చేస్తున్న మత్స్యకారుల డేటా ఆన్‌లైన్ చేస్తామన్నారు.

News April 17, 2025

శ్రీకాకుళంలో జాబ్ మేళా

image

శ్రీకాకుళం జిల్లాలో గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ‌లో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ నెల 27న ఉదయం 9.30 నుంచి మినీ జాబ్ మేళా ప్రారంభం కానుంది. ఆసక్తి కలిగిన 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని ప్రిన్సిపల్ p. సురేఖ తెలిపారు. సుమారు 20 కార్పొరేట్ సంస్థలు పాల్గొంటాయని చెప్పారు. 

error: Content is protected !!