News June 16, 2024

శ్రీకాకుళం: జులై 1 నుంచి కొత్త క్రిమినల్ చట్టాలు

image

వచ్చేనెల 1వ తేదీ నుంచి దేశంలో కొత్త క్రిమినల్ చట్టాలు అమల్లోకి రానున్నాయని జిల్లా డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ మెట్ట మల్లేశ్వరరావు అన్నారు. జిల్లా కోర్టులో ప్రాసిక్యూషన్ కార్యాలయంలో ఆయన పీపీలతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. కొత్త చట్టాలపై భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్షి అధినీయం, భారతీయ నాగరిక సురక్ష సంహిత మొదలైన కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన కల్పించారు.

Similar News

News October 3, 2024

వైసీపీ డాక్టర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా మాజీ మంత్రి అప్పలరాజు

image

వైసీపీ రాష్ట్ర డాక్టర్స్ విభాగం అధ్యక్షుడుగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన మాజీ మంత్రి డా.సీదిరి అప్పలరాజు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి నియామక పత్రాన్ని విడుదల చేశారు. పార్టీకి సంబంధించి డాక్టర్స్, విద్యార్థి, ఇంటలెక్చువల్ విభాగాలకు సంబంధించి నియామకాలు చేపట్టారు. ఇందులో డాక్టర్స్ విభాగానికి సిక్కోలుకు స్థానం లభించింది.

News October 2, 2024

శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మాణానికి సిద్ధం: కేంద్ర మంత్రి

image

శ్రీకాకుళం జిల్లాలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి తాము సిద్ధంగా ఉన్నామని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. బుధవారం పాతపట్నంలో పీఎం జన్మాన్ వసతిగృహ నిర్మాణానికి రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావుతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం బహిరంగ సభలో మాట్లాడుతూ.. భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తిచేస్తామన్నారు.

News October 2, 2024

సికింద్రాబాద్- శ్రీకాకుళానికి ప్రత్యేక రైలు

image

దసరా సందర్భంగా సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం వెళ్లేందుకు ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా 07487 నంబర్ గల ట్రైన్ సికింద్రాబాద్-శ్రీకాకుళం రోడ్డు మధ్య ఆరు ట్రిప్పులు తిరుగుతుందని తెలిపారు. ఈ రైలు అక్టోబర్ 2 నుంచి 30వ తేదీ వరకు ప్రతి బుధవారం నడపనున్నారు. ఈ మేరకు ప్రయాణికులు విషయాన్ని గమనించాలని అన్నవరం, విజయనగరం మధ్య రాకపోకలు సాగిస్తుందని రైల్వే అధికారులు సూచించారు.