News January 10, 2026
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

★ఇచ్ఛాపురం: గంజాయి తరలిస్తున్న ముగ్గురు అరెస్ట్.
★పలాసలో కొండలు, చెరువులు మాయం అవుతున్నాయి: సీదిరి
★బట్టేరు: గొంతు తడవాలంటే.. కావిడి పట్టాల్సిందే
★శ్రీకాకుళం: పెరిగిన ప్రయాణీకుల రద్దీ
★ఇచ్ఛాపురంలో బీభత్సం సృష్టించిన దొంగలు
★శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో మరమ్మతుల పనులు
★ కొత్తూరు: రహదారిపై బస్సు..వెళ్లేదెలా బాసు
Similar News
News January 11, 2026
శ్రీకాకుళంలో 57 ఉద్యోగాల దరఖాస్తుకు నేడే లాస్ట్!

శ్రీకాకుళం జిల్లాలో కస్తూర్బా గాందీ బాలికల విద్యాలయాల్లో(KGVB) మొత్తం 57 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో ముగియనుంది. ఈ క్రమంలో టైప్-3లో 30, టైప్-4 కేజీబీవీల్లో 27 పోస్టులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ప్రభుత్వం భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల మహిళా అభ్యర్థులు 18 ఏళ్ల వయసు కలిగినవారు మాత్రమే అప్లికేషన్లను జిల్లా కేంద్రంలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
News January 11, 2026
శ్రీకాకుళం: ప్రైవేటు ట్రావెల్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్

సంక్రాంతి పండుగ వేళ ప్రైవేటు బస్సుల్లో ప్రయాణికుల నుంచి అదనపు ఛార్జీలు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఉప రవాణా కమిషనర్ హెచ్చరించారు. జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ప్రైవేటు బస్సు ఆపరేటర్లు, యజమానులతో శనివారం ఆయన సమీక్షా నిర్వహించారు. సంక్రాంతి పండగ రద్దీని ఆసరాగా చేసుకుని అనధికారికంగా ఛార్జీలు పెంచి ప్రయాణికులకు భారం కలిగించవద్దని, బస్సులు ఫిట్నెస్ తప్పనిసరి అన్నారు.
News January 11, 2026
శ్రీకాకుళం: అమృత్ భారత్ రైళ్లు ఆగనున్న స్టేషన్లు ఇవే

శ్రీకాకుళం జిల్లాలోని పలు రైల్వేస్టేషన్లలో అమృత్ భారత్ ఆగనున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం తెలిపారు. న్యూ జల్పైగురి-హౌరా-బెంగళూరు మార్గంలో భాగంగా శ్రీకాకుళం, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో హాల్ట్ కల్పించారు. 16597-98, 16107-07 నంబర్ గల రైళ్లకు శ్రీకాకుళం, పలాసలలో హాల్ట్ కల్పించగా, 202603-04, 20609-10, 16223-24 రైళ్లు శ్రీకాకుళం, పలాస, సోంపేట, ఇచ్ఛాపురంలో ఆగనున్నాయి.


