News October 8, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

➥టెక్కలి: ప్రమాదాలకు కుదేలవుతున్న కార్మిక కుటుంబాలు
➥కంచిలి: విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూడాలి: కలెక్టర్
➥సంతబొమ్మాళి: మంత్రి ఆదేశాలతో శరవేగంగా పారిశుద్ధ్య పనులు
➥క్వారీ ప్రమాద ఘటనలో క్షతగాత్రులను పరామర్శించిన కలెక్టర్, ఎస్పీ
➥శ్రీకూర్మనాథుని సన్నిధిలో గోవా గవర్నర్
➥ఆర్థిక వ్యవహారాలు పారదర్శకంగా ఉండాలి: MLA కూన
➥కొత్తూరు: కేజీబీవీ ప్రిన్సిపాల్, అకౌంటెంట్‌పై వేటు
Similar News
News October 9, 2025
SKLM: ‘ఈ నెల 10న ZP స్థాయి సంఘం సమావేశం’

ఈనెల 10న జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించడం జరుగుతుందని సీఈవో డీ. సత్యనారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుంచి వివిధ స్థాయిల్లో జరగనున్న సమావేశాలకు విధిగా ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరుకావాలని ఆయన కోరారు. సంబంధిత సభ్యులకు సమాచారం పంపించినట్లు పేర్కొన్నారు.
News October 8, 2025
శ్రీకాకుళం: ‘మరో మూడు గంటలు..సురక్షిత ప్రదేశాల్లో ఉండండి’

శ్రీకాకుళం జిల్లాలోని మరో మూడు గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చిరికలు జారీ చేసింది. ఈ వానలు ఇచ్ఛాపురం, సోంపేట, టెక్కలి, శ్రీకాకుళం, నరసన్నపేట పరిసర ప్రాంతాల్లో పడతాయని చెప్పారు. పిడుగులతో పాటు 40-50 కి.మీ ఈదురుగాలులు వీస్తాయని, ప్రజలెవ్వరూ బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద ఉండవద్దని కలెక్టరేట్ నుంచి ఓ ప్రకటన వెలువడింది.
News October 8, 2025
పొందూరు : రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

పొందూరు మండలం తుంగపేట సమీపంలో రైల్వే గేటు వద్ద గుర్తుతెలియని మృతదేహాన్ని గుర్తించినట్లు జీఆర్పీ హెచ్సీ మధుసూదనరావు బుధవారం తెలిపారు. మృతుని వయస్సు 35 సంవత్సరాలు ఉండి గడుల కలర్ చొక్కా ధరించినట్లు తెలిపారు. రైలు ప్రయాణం చేస్తున్న సమయంలో రైలు నుంచి జారిపడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.