News October 12, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

➸టెక్కలి: ప్రభుత్వ వైఫల్యాలు కోటి సంతకాలతో ప్రజలకు తెలియాలి
➸శ్రీకాకుళం: స్టేడియం నిర్మాణం పూర్తి అయ్యేదెప్పుడో ?
➸సత్యవరంలో తాగునీటికి ఇక్కట్లు.. ఐదు రోజులగా పాట్లు
➸శ్రీకాకుళం: తిలక్ నగర్‌లో చోరీ.. బంగారు ఆభరణాల అపహరణ
➸జలుమూరు: కారును తగలబెట్టిన గుర్తుతెలియని దుండగులు
➸సంతబొమ్మాళి: ప్రమాదకరంగా ట్రాన్స్‌ఫార్మర్
➸కంచిలి: ‘వయో పరిమితి 60నుంచి 62ఏళ్లకు పెంచాలి
Similar News
News October 12, 2025
శ్రీకాకుళం: ‘అక్టోబర్ 20 వరకు పుస్తక మహోత్సవం’

అక్టోబర్ 20వ తేదీ వరకు 10 రోజుల పాటు శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల జంక్షన్ వద్ద మున్సిపల్ మైదానంలో సిక్కోలు పుస్తక మహోత్సవం–2025 నిర్వహిస్తున్నట్లు నిర్వహణ కమిటీ ఛైర్మన్ డాక్టర్ కనుగుల సుధీర్ తెలిపారు. శనివారం పట్టణంలోని యూటీఎఫ్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ప్రదర్శనలో పలు రకాల పుస్తకాలు విక్రయించడం జరుగుతుందన్నారు. ప్రతిరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, జానపద కళలు ఉంటాయి.
News October 11, 2025
ఉత్తరాంధ్రలో చేపడుతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి: చంద్రబాబు

అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా ఉత్తరాంధ్రలో చేపడతున్న అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో విఫలమవుతున్నామని CM చంద్రబాబు వ్యాఖ్యనించారు. విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుతో పాటు స్టీల్‌ప్లాంట్ మూతపడకుండా కాపాడామన్నారు. ముఖ్యంగా IT కంపెనీల స్థాపన, గూగుల్ డేటా సెంటర్, మిట్టల్ స్టీల్ వంటి కీలక ప్రాజెక్టులు త్వరలో ప్రారంభం కానున్నాయన్నారు. అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రులను ఆదేశించారు.
News October 11, 2025
టెక్కలి: అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెనుక భాగంలోని తోటలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి మృతదేహం కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. తోటలో వేలాడుతున్న వ్యక్తి టెక్కలిలోని ఎన్టీఆర్ కాలనీ 9వ లైన్‌లో నివాసముంటున్న గణపతి(50)గా గుర్తించారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు ఎస్ఐ రాము కేసు నమోదు చేశారు. అనుమానాస్పద మృతిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.