News February 15, 2025
శ్రీకాకుళం: ‘ట్రాఫిక్ నియమాలు పాటించండి’

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 7 రోడ్ల జంక్షన్ వరకు రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీ జరిగింది. శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం 1,2 డిపో మేనేజర్లు అమర సింహుడు, శర్మ పాల్గొన్నారు. అనంతరం ప్రయాణీకులతో పాటు ప్రజలకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ట్రాఫిక్ రూల్స్ ప్రతి బక్కరూ పాటించాలని, నియమాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని వారు హెచ్చరించారు.
Similar News
News November 3, 2025
పాపం ‘పసి’ ప్రాణం.. పుట్టడమే శాపమా..?

శ్రీకాకుళంలోని అరసవిల్లి జంక్షన్ సమీప మురుగు కాలువలో సోమవారం ఓ శిశువు మృతదేహం కంటతడి పెట్టించింది. తల్లి ఒడిలో లాలన పొందాల్సిన పసికందు మురుగులో తేలుతూ కనిపించడంతో మాతృత్వానికి మచ్చ తెచ్చేలా ఉందని పలువురు వాపోయారు. సమాచారం అందుకున్న ఎస్ఐ హరికృష్ణ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకొని శిశువు మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. నాలాలో పడేశారా? వేరే కారాణాలున్నాయా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.
News November 3, 2025
శ్రీకూర్మంలో బండి ఎక్కిన పడవ

గార(M) శ్రీకూర్మనాథ స్వామి ఆలయం సమీపంలో ఆదివారం పడవను పోలిన బండిని చూసి స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గత మూడు రోజులుగా వేటకు వెళ్లని మత్స్యకారులు నావలకు రిపేర్లు చేయించారు. సాయంత్రం పడవను నాటు బండిపై ఎక్కించుకొని తీసుకుని వెళ్లిన దృశ్యాన్ని చూసేయండి.
News November 3, 2025
నేడు శ్రీకాకుళంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం

నేడు (నవంబర్ 3న) ప్రజా ఫిర్యాదులు నమోదు మరియు పరిష్కార వేదిక, శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. https://Meekosam.ap.gov.in వెబ్ సైట్లో అర్జీదారులు తమ ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు. వినతులు సమర్పించిన అనంతరం వాటి స్థితిని తెలుసుకొనేందుకు 1100 నంబర్‌కు నేరుగా ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు.


