News September 2, 2025

శ్రీకాకుళం: డిగ్రీ ప్రవేశాలకు రేపే తుది గడువు

image

జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రథమ సంవత్సర ప్రవేశాలకు సెప్టెంబర్ 3వ తేదీ తుది గడువు. ఈ మేరకు అన్ని కళాశాలకు ఉన్నత విద్యా మండలి నుంచి ఆదేశాలు రావడంతో సంబంధిత ప్రిన్సిపాల్స్, సిబ్బంది ప్రవేశాలపై దృష్టి సారించారు. వాస్తవానికి సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా గడువు పొడిగింపుతో సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ప్రథమ సంవత్సర తరగతులు ప్రారంభం కానున్నాయి.

Similar News

News September 3, 2025

అరసవిల్లి సూర్య దేవాలయం మూసివేత

image

అరసవిల్లి ఆదిత్య ఆలయాన్ని ఈ నెల 7న భాద్రపద పౌర్ణమి చంద్ర గ్రహణం సందర్భంగా మూసివేయనున్నట్లు ఆలయ ఈవో ప్రసాద్, ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం ఉదయం వరకు ఆలయాన్ని మూసివేస్తున్నామన్నారు. మరుసటి రోజు ఉదయం ఆలయ సంప్రోక్షణ అనంతరం స్వామి దర్శనానికి భక్తులను అనుమతిస్తామన్నారు.

News September 3, 2025

పలాసలో దారుణ హత్య ..!

image

పలాస(M) కేసుపురంలో మంగళవారం అర్ధరాత్రి చిల్లంగి నెపంతో గ్రామానికి చెందిన వృద్ధుడు ఉంగ శ్రీరాములు (80) ని రాళ్లతో కొట్టి హత్య చేశారు. అదే గ్రామానికి చెందిన అంబాల తులసిరావు (35) ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. పలువురు దాసుల వద్దకు వెళ్లగా గ్రామానికి చెందిన వ్యక్తి చేతబడి చేయడంతో ఇలా జరిగిందని తెలిపారు. అనుమానంతో ఈ ఘాతకానికి పాల్పడినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 3, 2025

సుగాలి ప్రీతి కేసును రాజకీయంగా వాడుకున్నారు : ఎమ్మెల్సీ కళ్యాణి

image

2017లో రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసును 2024 ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా వాడుకున్నారని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఆరోపించారు. మంగళవారం సాయంత్రం బాధిత కుటుంబాన్ని ఆమె వైసీపీ నేతలతో కలిసి పరామర్శించారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారని గుర్తు చేశారు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.