News October 13, 2024

శ్రీకాకుళం: డీఎస్సీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

image

SC, STఅభ్యర్థులకు డీఎస్సీ పరీక్ష కోసం మూడు నెలలు పాటు అర్హులైన మెరిట్ అభ్యర్థులకు రాష్ట్రంలో శిక్షణ పొందుటకు అవకాశం ఉందని కలెక్టర్ కార్యాలయ సిబ్బంది ఒక ప్రకటనలో తెలిపారు. దీని కోసం http://jnanabhumi.ap.gov.in ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 11 నుంచి 21 వరకు మాత్రమే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Similar News

News October 13, 2024

లావేరు: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

లావేరు మండలం కేశవరాయనిపాలెం పంచాయతీ హనుమయ్యపేట గ్రామానికి చెందిన నాయిని చంటి (26) రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందాడు. నిన్న మురపాకు టిఫిన్‌కు బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బైక్‌ ఢీకొంది. భర్త మృతి చెందడంతో భార్య భవాని ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతం భవాని మూడు నెలల గర్భవతి. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను శ్రీకాకుళం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

News October 13, 2024

టెక్కలి: వారంలో కుమార్తె పెళ్లి.. యాక్సిడెంట్‌లో తండ్రి మృతి

image

టెక్కలి మండలం శ్యామసుందరాపురం గ్రామానికి చెందిన రుంకు మోహనరావు(55) అనే వ్యక్తి ఆదివారం రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఈనెల 20వ తేదీన తన కుమార్తె హిమ వివాహం నేపథ్యంలో పెళ్లి పిలుపులకు సైకిల్‌పై వెళ్తుండగా టెక్కలి జాతీయ రహదారిపై విక్రంపురం గ్రామం సమీపంలో వెనుక నుంచి లారీ ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

News October 13, 2024

SKLM: మద్యం సీసా గుచ్చుకొని యువకుడి మృతి

image

శ్రీకాకుళం జిల్లాలో ఘోరమైన ఘటన జరిగింది. మెళియాపుట్టి మండలం మురికింటిభద్ర గ్రామానికి చెందిన సవర సురేశ్(28) మద్యం తాగి బైకుపై వస్తుండగా అదుపుతప్పి బోల్తా పడ్డాడు. అప్పటికే మద్యం బాటిళ్లను కడుపులో ఉంచుకొని డ్రైవ్ చేస్తుండటంతో.. అవి పగిలిపోయాయి. సీసా పగిలి కడుపులో గుచ్చుకుంది. తీవ్రంగా గాయపడటంతో సురేశ్ మృతి చెందాడు. ఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు.