News January 4, 2025

శ్రీకాకుళం: డ్వాక్రా బజార్ సోమవారానికి వాయిదా

image

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో స్థానిక మునిసిపల్ మైదానంలో ఆదివారం ప్రారంభించిన డ్వాక్రా బజార్ ప్రారంభోత్సవం వాయిదా వేయటం జరిగిందని డీఆర్డిఏ పీడీ పీ కిరణ్ కుమార్ తెలిపారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ కొన్ని సమస్యలు కారణంగా దీనిని వాయిదా వేస్తున్నామని పేర్కొన్నారు. ఇదే కార్యక్రమాన్ని సోమవారానికి మార్చామని, దీనిని గమనించాలని స్పష్టం చేశారు.

Similar News

News January 6, 2025

SKLM: వాక్ఫ్ ఆస్తుల సమగ్ర సర్వే చేపట్టండి

image

వాక్ఫ్ ఆస్తుల సమగ్ర సర్వే చేపట్టి రెవెన్యూ అధికారుల సమక్షంలో హద్దులు నిర్వహించాలని కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్ ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం వాక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కమిటీ సమావేశం జిల్లా మైనార్టీ అధికారి మెంబర్ అండ్ కన్వీనర్ ఆర్ ఎస్ జాన్ సమక్షంలో జరిగింది. జిల్లాలో ఉన్న అన్ని వాక్ఫ్ ఆస్తులను ఏడీ సర్వే ద్వారా సర్వే చేపట్టి హద్దులు ఏర్పాటు చేయాలన్నారు.

News January 6, 2025

పొందూరు: గుండెపోటుతో జవాన్ మృతి

image

పొందూరు తోలాపి గ్రామానికి చెందిన బొనిగి రమణారావు ఛత్తీసగఢ్ CRPF జవాన్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన పండగ సెలవులకు స్వగ్రామానికి వచ్చారు. ఈ మేరకు సోమవారం ఉదయం వాష్ రూమ్‌కు వెళ్లారు. అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే పడిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే రిమ్స్‌కు తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

News January 6, 2025

ఆమదాలవలస: అత్యాచారం కేసులో నిందితుడికి రిమాండ్

image

ఆమదాలవలసలో ఓ మైనర్ బాలికపై అదే వీధికి చెందిన కోటిపల్లి రాజు (23) మాయమాటలు చెప్పి ప్రేమ పేరుతో అత్యాచారం చేసి గర్భవతిని చేసిన ఘటన విధితమే. ఈ మేరకు సోమవారం ఆమదాలవలస పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ సీహెచ్ వివేకానంద మీడియా సమావేశం నిర్వహించారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తామని అన్నారు. సీఐ సత్యనారాయణ, ఎస్ఐ బాలరాజు పోలీసులు ఉన్నారు.