News September 1, 2024
శ్రీకాకుళం: తుఫాన్ నేపద్యంలో వంశధార గేట్లు మూసివేత

శ్రీకాకుళం జిల్లాలో తుఫాన్ ప్రభావం నేపద్యంలో శనివారం సాయంత్రం హిరమండలం బీఆర్ఆర్ వంశధార ప్రాజెక్ట్ గేట్లను మూసివేసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ప్రధానంగా వంశధార ఎడమ, కుడి ప్రధాన కాలువల గేట్లను మూసివేసినట్లు ప్రాజెక్ట్ ఎస్ఈ బీ.రాంబాబు తెలిపారు. జిల్లాలోని సాగునీటి కాలువల ద్వారా నీరు సరఫరా అవుతున్న నేపథ్యంలో తుఫాన్ కారణంగా వరద పోటెత్తే ఆవకాశం ఉండడంతో గేట్లను మూసివేసినట్లు తెలిపారు.
Similar News
News February 12, 2026
నదుల అనుసంధానంతో మారనున్న సిక్కోలు ముఖ చిత్రం

రానున్న రోజుల్లో గోదావరి-వంశధార నదుల అనుసంధానంతో సాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో సిక్కోలు ముఖచిత్రం మారనుంది. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాల అనుసంధానానికి కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో జిల్లా రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ప్రక్రియ సాకారమైతే జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో వంశధార నది ఎండిపోకుండా గోదావరి జలాలు ఆదుకోనున్నాయి.
News February 12, 2026
నదుల అనుసంధానంతో మారనున్న సిక్కోలు ముఖ చిత్రం

రానున్న రోజుల్లో గోదావరి-వంశధార నదుల అనుసంధానంతో సాగు నీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం లభించడంతో సిక్కోలు ముఖంచిత్రం మారనుంది. పోలవరం ప్రాజెక్ట్ ద్వారా గోదావరి జలాల అనుసంధానానికి కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపడంతో జిల్లా రైతాంగంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ప్రక్రియ సాకారమైతే జిల్లాలో చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో వంశధార నది ఎండిపోకుండా గోదావరి జలాలు ఆదుకోనున్నాయి.
News February 12, 2026
SKLM : మహిళపై దాడి.. ఒకరిపై కేసు

కోటబొమ్మాళి మండలం కన్నెవలస గ్రామానికి చెందిన కాళ్ల సింహాద్రమ్మ తనపై దాడి చేసి గాయపరిచారని అదే గ్రామానికి చెందిన దేవాది అప్పలమ్మ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. తాగునీటి కుళాయి వద్ద నీరు పట్టుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చి కొట్టి గాయపరిచినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వి. సత్యనారాయణ తెలిపారు.


