News June 26, 2024

శ్రీకాకుళం: దరఖాస్తుకు నేడే లాస్ట్

image

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో 6, 7, 8, 9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి దరఖాస్తుల గడువు నేటితో ముగియనుంది. ఇప్పటికే ఆయా పాఠశాలల ప్రిన్సిపల్స్ ఈ నెల 26లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాలో శ్రీకాకుళం, ఎచ్చెర్ల, ఆమదాలవలస, పాతపట్నం, నందిగాం, తదితర మండలాల్లో ఉన్న గురుకులాల్లో సీట్ల భర్తీ చేయనున్నారు. ఈ నెల 29న ఉ.10 గంటల నుంచి 11 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుంది.

Similar News

News June 29, 2024

అనారోగ్యంతో డిప్యూటీ MRO ఆత్మహత్య

image

అనారోగ్యంతో ఓ డిప్యూటీ MRO ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కోటబొమ్మాలి మండలంలో శుక్రవారం జరిగినట్లు పోలీసులు తెలిపారు. నీలంపేటకు చెందిన ఆర్.శ్రీనివాస్ రావు పౌరసరఫరాల విభాగంలో డిప్యూటీ తహశీల్దార్‌గా పని చేస్తూ శ్రీకాకుళంలోని ఇందిరా నగర్‌లో ఉంటున్నాడు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News June 29, 2024

శ్రీకాకుళం: ఇంజినీరింగ్ కోర్సు దరఖాస్తుల పరిశీలన

image

RGUKT లో ఆరేళ్ల సమీకృత B.TECH ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి శ్రీకాకుళం క్యాంపస్‌కు సంబంధించి జులై 26, 27వ తేదీల్లో దరఖాస్తుల పరిశీలన ఉంటుందని డైరెక్టర్ కె.బాలాజీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు క్యాంపస్‌లకు మొత్తం 53,863 మంది దరఖాస్తు చేసుకున్నారని అడ్మిషన్స్ కన్వీనర్ ఎస్.అమరేంద్ర కుమార్ శుక్రవారం వెల్లడించారు. అభ్యర్థులు గమనించాలని సూచించారు.

News June 28, 2024

శ్రీకాకుళం: ITIలో 3,608 సీట్లకు 826 ప్రవేశాలు

image

శ్రీకాకుళం జిల్లాలోని ఐటీఐలో ప్రవేశాలకు నిర్వహించిన కౌన్సెలింగ్ ఈ నెల 26వ తేదీతో ముగిసింది. జిల్లావ్యాప్తంగా మొత్తం 2,470 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 3,608 సీట్లు గాను కేవలం 826 మంది విద్యార్థులకు మాత్రమే ప్రవేశాలు కల్పించారు. ఈ క్రమంలో జిల్లాలో మొత్తం 23 ఐటిఐ కళాశాలల్లో 2,782 సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీనితో విద్యార్థులు రెండో విడత కౌన్సిలింగ్ త్వరగా నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నారు.