News April 14, 2025

శ్రీకాకుళం: నదిలో పడవపై నుంచి జారిపడి మత్స్యకారుడి మృతి

image

శ్రీకాకుళం రూరల్ మండలం గనగళ్లవానిపేట మొగ వద్ద నాగావళి నదిలో పడవపై నుంచి జారిపడి మత్స్యకారుడు మృతి చెందిన ఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే గనగళ్లవానిపేట గ్రామానికి చెందిన పుక్కళ్ల గణేశ్ (40) ఆదివారం చేపల వేటకు పడవపై వెళ్లి ఆయన జారిపడ్డాడు. ఎడమ చేతికి తాడు కట్టుకొని ఉండడం వలన వల లాగడంతో ఒడ్డుకు చేరలేక నీటిలో మునిగి మృతి చెందాడు. ఈ శ్రీకాకుళం రూరల్ ఎస్సై రాము కేసు నమోదు చేశారు.

Similar News

News April 15, 2025

SKLM: పెండింగ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి

image

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి, పరిపాలనాపరమైన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశిస్తూ కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మంగళవారం సమగ్ర సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో భూ పరిపాలన, తాగునీటి సరఫరా, ఐసీడీఎస్, గ్రామ సచివాలయాల పనితీరు వంటి కీలక అంశాలపై కలెక్టర్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.

News April 15, 2025

శ్రీకాకుళం: ఏపీ మోడల్ పాఠశాల పరీక్షల తేదీ మార్పు

image

ఏపీ మోడల్ పాఠశాలలో ఆరో తరగతి ప్రవేశాలకు నిర్వహించే పరీక్షలు తేదీ ఏప్రిల్ 21కి మార్పు జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం 20వ తేదీన “ఈస్టర్” పండగ ఉండటం వలన తేదీ మారుస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాలో గల 13 మోడల్ పాఠశాలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు ఏప్రిల్ 21కి పరీక్షలకు హాజరుకావాలని తెలిపారు.

News April 15, 2025

శ్రీకాకుళం: జిల్లాలో 857 చలివేంద్రాలు ఏర్పాటు

image

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదేశాల మేరకు జిల్లాలో 857 చలివేంద్రాలు మంగళవారం ఏర్పాటు చేశారు. జిల్లాలోని 912 గ్రామ పంచాయతీల్లో ఈ చర్యలు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. సర్వే ప్రకారం ఈ చలివేంద్రాలలో 137 ప్రభుత్వ శాఖల ద్వారా, 693 స్థానిక సంస్థల ద్వారా, 27 స్వచ్చంద సంస్థల ద్వారా ఏర్పాటు చేశారు. ప్రతి మండలానికి మానిటరింగ్ అధికారిని నియమించి పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు.

error: Content is protected !!