News April 21, 2025
శ్రీకాకుళం: నేడు ఈ మండలాల్లో రెడ్ అలర్ట్

శ్రీకాకుళం జిల్లాలో నేడు ఈ మండలాల్లో అధిక ఉష్ణోగ్రతలతో పాటు తీవ్ర వడగాలులు వీస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్ అలర్ట్ జారీ చేసింది. బూర్జ 41.5 డిగ్రీల ఉష్ణోగ్రత , హిరమండలం 41.4, ఎల్ ఎన్ పేట 41.3, పాతపట్నం 41.1 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటుందని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News April 21, 2025
నౌపడ: కోడిపందాలు కేసులో ఐదుగురి అరెస్ట్

సంతబొమ్మాళి మండలం మర్రిపాడులో కోడిపందాలు ఆడుతున్న ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం సాయంత్రం జరిగిన దాడుల్లో భాగంగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ పందెంకి వినియోగించిన సామగ్రి తో పాటు రూ. 3,210 నగదును స్వాధీనం చేసుకున్నారు. నౌపడ సబ్ ఇన్స్పెక్టర్ నారాయణస్వామి కేసు నమోదు చేశారు.
News April 21, 2025
ఎచ్చెర్ల: సీఎం పర్యటనకు స్థల పరిశీలన

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 26న మత్స్యకార భరోసా ప్రారంభ కార్యక్రమానికి ఎచ్చెర్ల పర్యటనకు రానున్నారు. ఈ మేరకు ఆదివారం మధ్యాహ్నం ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఈశ్వరరావు, ఆర్డీవో ప్రత్యుష కార్యక్రమ ఏర్పాట్లకు మత్స్యకార గ్రామాలైన బుడగట్ల పాలెం ,జీరుపాలెం, కొవ్వాడలో స్థల పరిశీలన చేశారు. వీరి వెంట డీఎస్పీ, అధికారులు, కూటమి నాయకులు ఉన్నారు.
News April 21, 2025
అరసవల్లిలో పోటేత్తిన భక్తులు..పెద్ద మొత్తంలో ఆదాయం

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి నేడు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేణా రూ.2,66,700- లు, పూజలు విరాళాల రూపంలో రూ.70,548, ప్రసాదాల రూపంలో రూ.1,38,320 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని తెలిపారు.