News December 24, 2024

శ్రీకాకుళం: నేడు భారీ వర్ష సూచన

image

అల్పపీడనం ప్రభావంతో మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖ జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సోమవారం తెలిపారు. ఈ మేరకు ప్రజలకు పలు సూచనలు చేస్తూ వివరాలు వెల్లడించారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Similar News

News December 24, 2024

శ్రీకాకుళం ఘోర ప్రమాదంలో మృతులు వీరే!

image

కంచిలి మండలం పెద్ద కొజ్జిరియా వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు <<14965595>>మృతి<<>> చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. విశాఖపట్నం సీతమ్మధార నుంచి ఒడిశాలోని జాజ్పూర్ అమ్మవారి దర్శనానికి వెళ్తుండగా మార్గమధ్యలో ఈ ఘటన జరిగింది. ఓవర్ స్పీడ్‌తో వెళ్తున్న కారు కరెంట్ పోల్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో విశాఖలోని సీతమ్మధారకు చెందిన కదిరిశెట్టి సోమేశ్వరరావు(48), ఎం.లావణ్య(43), స్నేహగుప్తా(18) మరణించారు.

News December 24, 2024

శ్రీకాకుళం: విజిలెన్స్ మోనిటరింగ్ నూతన కమిటీ సభ్యుడిగా వాబ యోగి

image

జిల్లా విజిలెన్స్ మోనిటరింగ్ నూతన కమిటీని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సోమవారం ప్రకటించారు. ఈ కమిటీల్లో భాగంగా సారవకోట మండలానికి చెందిన రాష్ట్ర ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఉపాధ్యక్షుడు వాబ యోగేశ్వరరావును సభ్యుడిగా నియమించారు. ఈ సందర్భంగా యోగి మాట్లాడుతూ ఎస్టీ కులం నుంచి తనను ఎంపిక చేయడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌కు మంగళవారం ఉదయం కృతజ్ఞతలు తెలియజేశారు.

News December 24, 2024

SKLM: నేటి నుంచి సెలవులు

image

శ్రీకాకుళం జిల్లాలోని డా.బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ, బీఈడీ తదితర కాలేజీల సెలవుల షెడ్యూల్‌ను విడుదల చేశారు. దీని ప్రకారం ఈనెల 24  నుంచి 26వ తేదీ వరకు మూడు రోజుల పాటు క్రిస్మస్ సెలవులని వర్శిటీ రిజిస్ట్రార్ పి.సుజాత తెలిపారు. అలాగే  జనవరి 10వ తేదీ నుంచి అదే నెల 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులని.. తిరిగి కళాశాలలు జనవరి 20న రీఓపెన్ చేయాలని ఆదేశించారు.