News June 24, 2024

శ్రీకాకుళం నేపథ్యంతోనే తండేల్..

image

నాగ చైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం తండేల్. ఈ సినిమా నేపథ్యమంతా శ్రీకాకుళం చుట్టూనే ఉంటుందని చిత్ర కథా రచయిత కార్తీక్ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ.. ఎచ్చెర్ల మండలం, కూనపేటలో పుట్టిన తాను సినిమాపై ఆసక్తితో 2012లో హైదరాబాద్‌కు వచ్చానన్నారు. 2018లో జిల్లాలోని కొంత మంది మత్స్యకారులు పొరపాటున సరిహద్దు దాటి 14 నెలలు పాకిస్థాన్‌లో ఉండగా.. ఆ నేపథ్యాన్నే సినిమాగా తీస్తున్నామన్నారు.

Similar News

News November 11, 2025

ఆత్మహత్య ఘటనలో ఇద్దరికి రిమాండ్: ఎస్ఐ

image

నందిగం మండలం తురకలకోట గ్రామానికి చెందిన ఎం.వెంకటరావు(34) అనే వ్యక్తి శనివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ మేరకు నందిగం పోలీసులు కేసు నమోదు చేశారు. వెంకటరావును వేధించిన పెట్రోల్ బంక్ యజమాని బీ.రమేశ్‌తో పాటు అతనికి సహకరించిన ఒక హెడ్ కానిస్టేబుల్ ఇరువురుని ఆదివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు నందిగం ఎస్ఐ షేక్ మహమ్మద్ అలీ తెలిపారు.

News November 11, 2025

SKLM: పిల్లలు దత్తత కావాలా.. ఐతే ఇలా చేయండి

image

అర్హులైన తల్లిదండ్రులు మిషన్ వాత్సల్య వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకుంటే పిల్లలను చట్టబద్ధంగా దత్తత ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. సోమవారం ఆయన కార్యాలయంలో దత్తత ప్రక్రియపై కరపత్రాన్ని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని విమల ఆధ్వర్యంలో సోమవారం విడుదల చేశారు. www.missionvataslya.wcd.gov.in వెబ్‌సైట్‌లో తమ వివరాలు నమోదు చేయాలన్నారు.

News November 10, 2025

SKLM: ‘బిల్లుల చెల్లింపు, భూసేకరణ పరిష్కరించాలి’

image

వంశధార ప్రాజెక్ట్ పనుల్లో జాప్యాన్ని సహించేది లేదని, పెండింగ్‌లో ఉన్న పనులను తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ స్పష్టం చేశారు. వంశధార ప్రాజెక్ట్ పురోగతిపై సోమవారం కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన కీలక ప్యాకేజీల క్రింద పెండింగ్‌లో ఉన్న సుమారు రూ.18.09 కోట్ల విలువైన బిల్లుల చెల్లింపును వేగవంతం చేయాలన్నారు.